ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలపై ఎలాంటి ఆంక్షలు లేవని హైకోర్టు తీర్పు

Spread the love

– భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవంత్ రావు

హిందువులు అత్యంత భక్తి శ్రద్దాలతో పూజించే గణేష్ ఉత్సవాలకు ప్లాస్టర్ ఆఫ్ పారిష్ పై ఎలాంటి ఆంక్షలు లేవని హైకోర్టు తీర్పు ఇచ్చిందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ డాక్టర్ భగవంత్ రావు తెలిపారు. గురువారం డాక్టర్ భగవంత్ రావ్, అడ్వకేట్ కరుణ సాగర్ మాట్లాడుతూ… గురువారం తెలంగాణ హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన్నట్లు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేష్ విగ్రహాల పై ఎత్తు పై ఎలాంటి ఆంక్షలు లేవని హై కోర్టు తెలపడం శుభపరిణామనని వెల్లడించారు. ఇక తయారీదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తయారీదారులకు, గణేష్ నిర్వహకులకు ఎవరైనా ఇబ్బందులు గురి చేస్తే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీకి తెలియజేయాలని పేర్కొన్నారు.

Leave a Reply