Suryaa.co.in

Telangana

హిందూ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారు

– మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం
– కేసీఆర్ పేదల రక్తం తాగుతున్నాడు
– మోడీ ఇచ్చిన ఇండ్లపై కేసీఆర్ ను ప్రశ్నించే దమ్ము సబిత కు ఉందా?
– పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా… సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. 30 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేస్తున్నాం. మోడీ ఆదేశాలతో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నా. కేసీఆర్ పేదల రక్తం తాగుతున్నాడు.

బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. ఉచిత విద్య, వైద్యం ఇస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం. భాగ్యనగరం లో ఉన్న హిందూ సమాజాన్ని ఏకం చేస్తాం… ఎంఐఎం కు బుద్ధి చెబుతాం. హిందూ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారు. ST తండాలను కేసీఆర్ విస్మరించాడు. ND తండాలో రూ.350 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు.

సబిత trs పార్టీలో చేరిన తర్వాత మహేశ్వరం నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో సమాధానం చెప్పాలి. Trs, congress పార్టీలు ప్రజలను మోసం చేశాయి. ఇక్కడి స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్… తన ఇంట్లో మాత్రమే 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు.

పేదలకు ఇళ్ళు ఇవ్వని కేసీఆర్… తాను మాత్రం 100 రూమ్ ల ఇండ్లు కట్టుకున్నాడు. Trs ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గం కి ఎన్ని నిధులు ఇచ్చిందో… శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేస్తున్నా.కేంద్ర ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గంకు ఇచ్చిన నిధుల పై చర్చకు మేము సిద్ధం. మోడీ ఇచ్చిన ఇండ్లపై కేసీఆర్ ను ప్రశ్నించే దమ్ము సబిత కు ఉందా? బీజేపీ ప్రజల ఆకాంక్షలు, ఆశయాల కోసం పనిచేస్తుంది. తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య చేసిన ప్రాణ త్యాగాన్ని వృధా కానివ్వం.

తెలంగాణ ద్రోహులను మంత్రులుగా చేసి, సంకలో వేసుకుని తిరుగుతున్నాడు కేసీఆర్. వరంగల్ లో నిరుపేద పూజారిని హత్య చేస్తే… స్పందించని సీఎం కేసీఆర్. దళిత బిడ్డ నాగరాజు హత్యపై కూడా ఇంకా స్పందించలేదు. 500 చరిత్ర కలిగిన దేవాలయాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్. సుష్మాస్వరాజ్ మద్దతుతోనే తెలంగాణ వచ్చింది. బీజేపీ బిక్షతోనే కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవులు అనుభవిస్తున్నారు. ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేసిండు.

నిజమైన ఉద్యమకారులకు అన్యాయం చేసిన ఘనుడు కేసీఆర్. బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. జంప్ జిలానీల గోడమీద ఉంటారు. అధికారంలోకి ఏ పార్టీ వస్తే… ఆ పార్టీలోకి వెళ్లి, అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకుంటారు. బీజేపీ లో నమ్మిన సిద్ధాంతం కోసం నాయకులు అవుతారు… తాతల పేర్లు, తండ్రుల పేర్లు చెప్పుకుని కాదు. రేపు తుక్కుగూడలో జరిగే అమిత్ షా సభను అందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం.

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: కోలార్ ఎంపీ మునుస్వామి
30 రోజులుగా బండి సంజయ్ ప్రజల కోసం పాదయాత్రe చేస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్ర కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దళిత బంధు పథకం ఎవరికీ కేసీఆర్, కేటీఆర్ ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రజలను మోసం చేశారు. తెలంగాణ లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. మహేశ్వరం లో జరిగిన అభివృద్ధి కేంద్రం నిధులతోనే. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. రేపు అమిత్ షా వస్తున్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. కేసీఆర్ ఇంటికి పోయే సమయం ఆసన్నమైంది.

LEAVE A RESPONSE