గరికపాటి వారు, చాగంటి వారు, సామవేదం వారు… ఇలాంటి సరస్వతీ పుత్రులూ, నిస్వార్ధ ప్రవచనకారులు ఇరు తెలుగురాష్ట్రాల్లో వున్న సమాజానికి గురుతరబాధ్యత వహించి ఆధ్యాత్మిక బోధనలు, ప్రవచనాలు చేయకపోయి ఉంటే ఈ నీతి మాలిన సినిమా వాళ్ళ వలన, మన సమాజం,హిందూ ధర్మం ఎప్పుడో సర్వనాశనం అయిపోయి ఉండేది. ఈనాడు వారి పైన ఈ సినీ హీరోల ప్రోద్బలంతో, ఈ అభిమానులు చేస్తున్న నీచమైన దాడులు చూస్తూ ఉంటే ఆ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇది మీరు కాదనగలరా!!!???
ఇటువంటి మంచి ప్రవచనకారులకూ,పండితులకూ ప్రభుత్వం రక్షణ కల్పించకపోయినా, హిందూ సమాజమైనా సంరక్షణ కల్పించాలి. లేకపోతే ఇలాంటి సినీ హీరోల అభిమాన బానిసలు, హీరోల ప్రమేయంతోనే ఎటువంటి దాడులు అయినా చేయవచ్చు. గతంలో చాగంటి వారిపైనా, గరికపాటి వారి పైనా దాడులు చేసి క్షమాపణలు చెప్పించిన విషయం మీకు గుర్తులేదా!!??
నిత్యం సోషల్ మీడియాలలో హిందూత్వం, తోటకూర కట్ట అని ప్రసంగాలు, వాట్సాప్ గ్రూప్స్ లో msg ల్లో వీడియోలు చేసి మరీ చెప్పే హిందూ పెద్దలు, హిందూ పులులు, సింహాలు, కాషాయ దళాలు ఇటువంటివి జరిగినప్పుడు బయటకు రాకుండా ముసుగులో ఎందుకు దాక్కుంటున్నారు? వాళ్ళని ఆ రకంగా బూతులు తిడుతూ మీడియాలలో, సభ్య సమాజంలో వారి పరువు తీసేస్తూ ట్రోల్ చేస్తుంటే మీలో కనీస చలనం కూడా రాలేదే… ఎందుకో..? మీకు మీరే బోధించే హిందు ధర్మం, ప్రచారం దేనికోసం…??? ఆలోచించండి…!
సమాజంలో ఆధ్యాత్మికంగా జరుగుతున్న నష్టానికి అడ్డుకట్ట వేయండి చేతయితే… ఈ సినీ అభిమానులకు, హీరోలకు భయపడి దాక్కోకుండా దయచేసి బయటికిరండి. ధర్మ రక్షకులు కాలేనపుడు దాక్కొని మీ డబ్బా మీరు కొట్టుకోండి. ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు ఈ ఇరు తెలుగు రాష్ట్రలలో… ఇదే యదార్థం.
– ధర్మ రక్షణా చైతన్య వేదిక