Suryaa.co.in

Features

హిందూ సంతుష్టీకరణ జరగాలి!

– ఇది మత వాదం కాదు.. ఇది దేశ హితవాదం

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మనదేశంలో జరిగిన ముస్లీమ్, క్రిస్టియన్ సంతుష్టీకరణలాగా.. హిందూ సంతుష్టీకరణ కూడా జరగాలి. ముస్లీములకు, క్రిస్టియన్లకు ఉన్న ప్రభుత్వ రాయితీలు, పథకాలు ఇకపై హిందువులకూ కావాలి. ఫ్రభుత్వం హిందూ సంతుష్టీకరణను మొదలుపెట్టాల్సిన తరుణం వచ్చేసింది.

కాశ్మీర్ ఎన్నికల ఫలితం ఈ దేశంలో హిందూ సంతుష్టీకరణ ఆవశ్యకతను తెలియజేస్తోంది. ‘ముస్లీము ఓటు ముస్లీముకే’ అన్న దాన్ని కాశ్మీర్ ముస్లీములు తేటతెల్లం చేశారు. హిందువుల పన్ను డబ్బుతో ఎంత లబ్ది పొందినా ముస్లీములు, క్రిస్టియన్ మత పరంగానే ఓటు వేస్తారు. అది మారదు. వాళ్లు సెక్యూలర్ స్ఫూర్తితోనూ, జాతీయతా భావంతోనూ, దేశం అన్న భావనతోనూ ఓటు వెయ్యరు అన్న వాస్తవాన్ని ఇంత వరకూ జరిగిన ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వాళ్ల మతానుకూల అభ్యర్థులు లేరని, నోటాకు ఓటు వేశారు ముస్లీమ్ ప్రజలు. హైదరాబాద్ పాత బస్తీలో హిందూ అభ్యర్థులు గెలవరు. హిందూ భావజాలానికి, జాతీయతా వాదానికి వ్యతిరేకంగానే ముస్లీమ్, క్రిస్టియన్ ఓటు పడుతోంది అని ఎన్నికల ఫలితాలు పదేపదే తెలియజేస్తున్నాయి.

మన దేశంలో సెక్యులరిజమ్ అన్నది తన అర్థాన్ని కోల్పోయి హిందువులకు శాపం అయింది. ముస్లీమ్, క్రిస్టియన్ వ్యక్తులకు ఉండని, వర్తించని సెక్యులరిజమ్.. హిందువులకు మాత్రం పెనుకీడుగా పరిణమించింది. ముస్లీంలకు, క్రిస్టియన్లకు మత ప్రాతిపదికన పథకాలు, రాయితీలు అమలు చెయ్యడం సెక్యులరిజం అవుతుందా? మత ప్రాతిపదికన పరిగణన, సంతుష్టీకరణ మొదలైనప్పుడే సెక్యులరిజమ్ భంగమూ, భగ్నమూ అయిపోయింది.

ముస్లీమ్, క్రిస్టియన్ ఓటు ఏకీకృతం అవుతున్నట్టుగా, హిందువుల ఓటు కూడా ఏకీకృతం అవాలి. దేశం కోసం హిందువుల ఓటు తప్పకుండా ఏకీకృతం కావాలి. హిందువుల భద్రత కోసం హిందువుల ఓటు ఏకీకృతం కావాలి. హిందువులు ఓటు ఏకీకృతం కాకపోతే మనదేశం నిలబడదు. హిందువుల ఓటు ఏకీకృతం అవకపోవడంవల్ల ..ఏ రకమైన పరిస్థితులు నెలకొంటాయో వెస్ట్ బెంగాల్, పంజాబ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు మనకు తెలియజేస్తున్నాయి.

దేశంలో అనూహ్యంగా తొలిసారిగా పూర్తిగా హిందూ-ఓటు ఏకీకృతమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన-బీ.జే.పీ. కూటమి ఘన విజయం సాధించింది. ఎక్కడైనా, ఎప్పుడైనా 40% శాతం ఓటు వస్తే అధికారం వచ్చినట్టే. 40% ఓటు వచ్చినా వై.సీ.పీ. ఘోరంగా ఓడిపోయింది. వై.సీ.పీ. కి వ్యతిరేకంగా ఏకృతమైన హిందూ-ఓటు అందుకు కారణం.

హరియాణా ఎనికల్లో వరుసగా బీ.జే.పీ. గెలవడానికీ కారణం హిందూ-ఓటు ఏకీకృతం అవడమే. కులాలకు, కుట్రలకు అతీతంగా ఏకీకృతమై విదేశీ మతోన్మాదం నుంచి, దేశ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు, దక్కించుకునేందుకు అక్కడి హిందువులు బీ.జే.పీ.ని గెలిపించుకున్నారు.

మొత్తం దేశంలోని హిందువులకు ఆంధ్ర ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల హిందువులు దిశా నిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల్లోని హిందువులు ఈ పరిణామాన్ని అవగతం చేసుకోవాలి. హిందువులు ఏకీకృతం అవాలి; దేశంలో హిందూ-పార్టీలు మాత్రమే అధికారంలోకి రావాలి.

ముస్లీమ్ ఓటుతో, క్రిస్టియన్ ఓటుతో గెలుద్దాం లేదా గెలుస్తాం లేదా గెలవాలి అన్న చింతనతో.. కొన్ని దేశ హానికర పార్టీలు చాలా కాలంగా పనిచేస్తున్నాయి. ముస్లీమ్ ఓటు, క్రిస్టియన్ ఓటు, హిందూ ఓటు అన్నదే సెక్యూలరిజం అన్నదానికి వ్యతిరేకం.

కొన్ని రాష్ట్రాల్లో ముస్లీమ్ ఓటుతో, క్రిస్టియన్ ఓటుతో కొన్ని పార్టీలు గెలిచాయి. ఈ అపాయకరమైన పరిస్థితిని ఇకపై లేకుండా చేయాలి. హిందూ-ఓటుతో మాత్రమే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవగలిగే పరిస్థితి రావాలి. హిందూ-ఓటు ఏకీకృతమై తేనే ఈ పరిస్థితి వస్తుంది. దేశ క్షేమం కోసం ఈ పరిస్థితి తప్పకుండా రావాలి.

హిందూ-ఓటు ఏకీకృతం కాకపోతే మనదేశం నిలబడదు. హిందూ సంతుష్టీకరణ జరగకపోతే హిందూ-ఓటు ఏకీకృతం కాదు. హిందువులకు అందాల్సిన మేలు, ప్రయోజనాలు అందడం లేదు అన్న ఆవేదన దేశ హిందువుల్లో చాలా కాలంగా చాలా తీవ్రంగా ఉంది. ఈ హిందువుల ఆవేదనను తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రజా ప్రభుత్వానికి ఉంది.

ఎంత చేసినా, ఎన్ని ఇచ్చినా ముస్లీమ్, క్రిస్టియన్ ఓటు బీ.జే.పీ. కి పడదు. బీ.జే.పీ.కి పడేది హిందువుల ఓట్లే. కనుక బీ.జే.పీ. హిందూ సంతుష్టీకరణతో పూర్తి హిందూ-ఓటును సాధించాలి. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి న్యాయంగా హిందూ జనానికి దక్కాల్సినవి దక్కి ఉంటే, విదేశీ మత సంతుష్టీకరణ ఆగిపోయి ఉంటే బీ.జే.పీ.కి 400 సీట్లు వచ్చేవి. తద్వారా దేశం మరింత పటిష్టం అయ్యే అవకాశం వచ్చి ఉండేది. బీ.జే.పీ. బలం దేశానికి బలం. బీ.జే.పీ.కి హిందు-ఓటు బలం. హిందు సంతుష్టీకరణతో బీ.జే.పీ. ఇంకా బలోపేతం కావాలి.

సెక్యూలరిజం స్ఫూర్తికి భిన్నంగా విదేశీ మత జనాభాకు ప్రభుత్వం పరంగా అప్పనంగా ఇప్పటికే ఎంతో లబ్ధి అందింది అని హిందువులు వాపోతున్నారు. హిందువులు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులు కారు. హిందువులు ఈ దేశంలో పెద్ద శాతం ప్రజలు. ప్రజాస్వామ్య ప్రమాణాల పరంగానూ, జన బలం రీత్యానూ హిందువులదే అగ్రస్థానం.

గత ఏడు దశాబ్దాలుగా విదేశీ మతస్థులు హిందువుల సొమ్ముతో పొందుతున్న లబ్ది ఇక చాలు.

ఈ దేశంలో పౌరులందరూ సమానులే. విదేశీ మతస్థులకున్న ప్రత్యేకమైన సదుపాయాలు హిందువులకు కూడా కావాలి. హిందువుల హక్కులు పరిరక్షించబడాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రజా ప్రభుత్వం హిందూ సంతుష్టీకరణ దిశగా ఆలోచనలు, ప్రణాళికలు, పథకాలు చేసి వాటిని సత్వరమే ఆచరణలోకి తీసుకురావాలి.

గత ఏడు దశాబ్దాలుగా జరుగుతున్న ముస్లీమ్, క్రిస్టియన్ సంతుష్టీకరణ ఇంక చాలు. ఇకపై హిందూ సంతుష్టీకరణ మాత్రమే ఈ దేశానికి కావాలి. జరుగుతున్న ముస్లీమ్, క్రిస్టియన్ సంతుష్టీకరణవల్ల ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజలైన హిందువులు ఎంతో కోల్పోయారు; ఎన్నో దెబ్బలు తిన్నారు; బాధితులయ్యారు. పరమత సంతుష్టీకరణవల్ల బాధితులైన హిందువులకు ఉపశమనం కావాలి. హిందువులకు ఉపకారం జరగాలి.

ఈ దేశంలో హిందువులకు భద్రత కావాలి. ఈ దేశంలో హిందువులకు ఉనికి కావాలి. హిందువులకు ఈ దేశం కావాలి. ఈ దేశానికి హిందువులు కావాలి.

విదేశీ మతోన్మాదం, విదేశీ విధ్వంసక భావజాలం, దేశ ద్వేషం, హిందూ విద్వేషం ఇవన్నీ సెక్యూలరిజం పేరుతో అమలు అవుతుండడం, చలామణి అవుతుండడం దేశంలోని పెద్ద శాతం ప్రజలైన హిందువులు క్రమేపీ తెలుసుకుంటున్నారు. ఈ సమయంలో దేశ ప్రజా ప్రభుత్వం హిందూ సంతుష్టీకరణను చేపట్టడం సరైన విధానం ఔతుంది.

హిందూ సంతుష్టీకరణ హిందూ-ఓటును ఏకీకృతం చేస్తుంది; హిందూ-ఓటు ఏకీకృతమైతే దేశం క్షేమంగా ఉంటుంది. ఇది మత వాదం కాదు. ఇది దేశ హితవాదం.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE