Suryaa.co.in

Features

హిందువులకు మతం లేదు.సనాతన ధార్మిక జీవన విధానమే ఉన్నది

ఈ దేశంలో సనాతన సంప్రదాయవాద హిందూ ధర్మపరులే తప్ప మత పిచ్చి ఉన్న వ్యక్తులెవ్వరూ లేరు.
గోరక్షణ, ధర్మ రక్షణ, సంస్కృతి పరిరక్షణ, హిందూ ఆధ్యాత్మికతలో భాగం మాత్రమే. అంతేకానీ ఇది మత కోణంలో చూడాల్సిన అవసరం లేదు !
అలాగే హిందువులకు మతం లేదు. సనాతన ధార్మిక జీవన విధానమే ఉన్నది
ఇది ఈదేశ మనుషుల్లో మానవ చైతన్యం హిందువుల జీవనవిధాన ధర్మ కర్తవ్యం.
అలాగే ఈ దేశం అందరికీ స్వేచ్ఛను కలిగించింది. కానీ హిందువులు ఎప్పుడూ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు !! కానీ దురదృష్టవశాత్తు, విదేశ మత చైతన్యం ఎక్కువగా ప్రబలుతూ !! రెండు వేల సంవత్సరాలకు పూర్వం
ఈ దేశంలో లేనటువంటి కొన్ని మత సంస్థలు నేడు ప్రతి రాష్ట్రంలో రెచ్చిపోయి మత విద్వేషాలను రెచ్చగొడుతుంది !!
విదేశీ శక్తుల అండదండలతో, ఈ దేశంలోని ప్రభుత్వాలు , కొందరు అధికారుల సహకారంతో హిందువులను ఎక్కడపడితే అక్కడ నరికి చంపుతున్నారు. హిందువుల చేతకాని తనాన్ని ప్రతి సారి గుర్తు చేస్తున్నారు !!
ఈ దేశాన్ని ఒకడు ఇస్లాం గా, ఇంకొకడు క్రిస్టియన్ గా చేయాలనే ప్రయత్నాలలో
యుద్ధం సాగిస్తూనే ఉన్నాడు ! హిందువులు ఏదైనా మాట్లాడితే మతపిచ్చి అంటున్నారు ! వారు ఏ రాద్ధాంతం చేసిన రాజశాసనంలా
తల ఊపుతున్నారు !
మెజారిటీగా ఉన్న హిందువులకే నేడు, నేను హిందువుని అని గర్వంగా బ్రతికే ధైర్యం లేకుండా చేశారు, చేస్తున్నారు.
ఎక్కడ రావాలి మార్పు? ఎవరికి కలగాలి కనువిప్పు?
మొన్న కర్ణాటక, నిన్న కర్మాన్ ఘాట్. రేపు నీ ఇంట్లో…!!
నీ ఒంట్లో రక్తం మరగనంతవరకు, హిందువు హిందూవుకి శత్రువుగా ఉన్నంతవరకు, నీ ఉనికిని నువ్వు కోల్పోక తప్పదు !! తస్మాత్ జాగ్రత్త….!!
కర్ణాటక , కర్మాంఘాట్ లాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆ దేవున్ని ప్రార్థిస్తూ ప్రతి హిందువుని చైతన్య పరుస్తూ….

సామాజిక సాధు
-చైతన్యం స్వామి

LEAVE A RESPONSE