హోంగార్డులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అనగాని సత్యప్రసాద్ లేఖ

పోలీసు శాఖలో హోం గార్డులు అత్యంత కీలకం.మండుటెండలో నిలబడి ట్రాఫిక్ క్రమబద్దీకరణ నుండి.. వీఐపీల భద్రత వరకు వారి సేవలు అమోఘం. కరోనా సమయంలో హోం గార్డులు ప్రజలకు అందించిన సేవలు మరిచిపోలేనివి.

హోమ్ గార్డుల ఇబ్బందుల్ని గుర్తించి 18.06.2018 న జీవో నెం.77 తో రోజు వారీ వేతనాలను రూ.600 చేసాం.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోం గార్డులకు రూ.5 లక్షలు మాత్రమే ఉన్న బీమాను.. గత ప్రభుత్వం రూ.30లక్షలకు పెంచాం.

తర్వాత వచ్చిన ప్రభుత్వం రోజు వారీ వేతనాన్ని కేవలం రూ.110 పెంచుతూ 12.10.2019న జీవో.876 జారీ చేసి చేతులు దులుపుకున్నది.రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల జీతభత్యాల పెంపు విషయమై చర్యలు తీసుకోకపోవడంతో హోంగార్డులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హోంగార్డులకు వేతనాల పెంపుదల విషయమై గతంలో గౌరవ సుప్రీంకోర్టు దిక్కార పిటిషన్ ఇచ్చింది.ఆదేశాలను అమలు చేయాలని డిజిపి ఆదేశించి చేతులు దులుపుకున్నారు. హోంగార్డులకు ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇవ్వాలని అశుతోష్ మిశ్రా సూచించారు.

హోంగార్డుల వేతనం పెంపుదలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి
16 వేల మంది హోంగార్డుల కుటుంబాలకు న్యాయం చేయాలి.సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలి. రిటైర్మెంట్ అనంతరం ఇచ్చే గ్రాట్యుటీ రూ.పది లక్షలు చేయాలి.

Leave a Reply