– ఇది ఎన్నికల ముందు ఓటర్లను మోసం చేయడం కాదా?
– తంగిరాల సౌమ్య
నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ప్రకటనలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తంగిరాల సౌమ్య పై చేసిన అనుచిత, అసందర్భ,అసత్య వ్యాఖ్యలను ఖండించారు
ఎన్నికల ముందు అధికార పార్టీ నేతలు వంద పడకల ఆసుపత్రి అంటూ మరో నయా మోసానికి తెరలేపారు. ఐదేళ్లుగా కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడానికి నందిగామ నియోజకవర్గం ప్రజానీకాన్ని అధికార పార్టీ నేతలు వారి మసకబారిన అభివృద్ధి మాయమాటలతో మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారు.
నందిగామ పట్టణం నడిబొడ్డు నందు అందరికీ ఆమోదయోగ్యంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని వీలైతే దానినే మల్టీ కార్పొరేట్ హాస్పిటల్ గా అభివృద్ధి చేయవచ్చు ఈ అధికార పార్టీ నేతలు. ఆ విషయాన్ని పక్కన పెట్టి నందిగామకు దూరంగా ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం వెనుక అంతర్యం ఏమిటో? అభివృద్ధి ముసుగులో అధికార పార్టీ నేతల కమీషన్ల తాయిలల గుట్టును అధికార పార్టీ నేతలు బహిర్గతం చేయాలి.
స్థల సేకరణ,భూ సర్వేలంటు అధికార పార్టీ నేతలు దండుకున్న కమిషన్ల లెక్కలు ప్రజల ముందు ఉంచాలి. నాబార్డ్ నిధుల గురించి తాతకు దగ్గులు నేర్పుతున్న ఎమ్మెల్సీ గారు గత తెలుగు దేశ ప్రభుత్వ హయాంలోనే నందిగామ పట్టణం మరియు కంచికచర్ల టౌన్ నందు స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయాలు సుమారు 80 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగినది.
జయంతి మరియు వెలది కొత్తపాలెం గ్రామాలలో సుమారు 25 లక్షల రూపాయల నాబార్డు నిధులతో అంగన్వాడి కార్యాలయాలు నిర్మించడం జరిగినది.. అయ్యా ఎమ్మెల్సీ గారు అక్కడికి వెళ్లి శిలాఫలకాలు చూస్తే మీ కళ్ళకు కచ్చితంగా నాబార్డు నిధుల వివరాలు తెలుస్తాయి. ఎన్నికల స్టంట్ లో భాగంగా ఐదేళ్లు నిద్రపోయిన మీరు ఇప్పుడు అభివృద్ధి అంటూ మీరు చేస్తున్న మీ బూటకపు చేష్టలు నందిగామ నియోజకవర్గ ప్రజానీకం పూర్తిగా తెలుసుకున్నారు
మహిళాలోకమన్నా, మహిళలన్నా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కు మొదటి నుంచి చిన్న చూపే తాను మహిళలపట్ల మాట్లాడుతున్న తీరు చూసి యావత్ మహిళా లోకం ఈసాడించుకుంటుంది. మహిళలు సైతం రేపు జరగనున్న ఎన్నికలలో ఓటుతో మొండితోక సోదరులను తరిమి తరిమి కొట్టనున్నారు.
రేపు జరగనున్న ఎన్నికలలో నందిగామ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని తరిమి కొట్టడానికి ప్రజానీకం సంసిద్ధంగా ఉన్నారు.. మీ పార్టీని మిమ్మల్ని నందిగామ ప్రజలు బంగాళాఖాతంలో కలపడం తథ్యం.