Suryaa.co.in

Telangana

10 శాతం నిధులు కూడా చెల్లించలేని ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఎలా ఇస్తారు.?

-ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ అడ్వాన్స్ డ్ కింద 10 శాతం నిధులు చెల్లించనంటుంది
-నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఐఆర్బీ సంస్థకే వంత పాడుతున్న కేటీఆర్
-అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

“ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో..టెండర్ మొత్తంలో 10 శాతం అడ్వాన్స్ డ్ గా చెల్లించాలి. ఆ ప్రకారం ఐఆర్బీ సంస్థ రూ. 7,388 కోట్లలో 738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే చెల్లించాల్సిన 10 శాతం చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతుంది. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థపై చర్యలు తీసుకోకుండా దానికి అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తీసుకువస్తున్నారు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

నిబంధనల మేరకు 10 శాతం నిధులు కూడా చెల్లించలేని ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రేవంత్ రెడ్డి సీఎల్పీ కార్యాయలంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సంపద అయిన ఓఆర్ఆర్ ను ముంబైకి చెందిన ఐఆర్బీ డెవలప్ మెంట్ సంస్థకు కేసీఆర్, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ పర్యవేక్షణలో తెగనమ్మారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

టెండర్ ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుంచి టెండర్ కు సంబంధించిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేంత వరకు జరిగిన దోపీడిని, దీని వెనుకాల ఉన్న పెద్దల ఆలోచనను పదే పదే కాంగ్రెస్ ప్రజలకు వివరిస్తూ వచ్చిందన్నారు. ఓఆర్ఆర్ ను అగ్గువకే ముంబై కంపెనీకే కట్టబెట్టిన కేటీఆర్ ఇప్పుడు మరో ఇప్పుడు మరో దోపిడీకి తెర తీశారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఓఆర్ఆర్ టెండర్ నియాయనిబంధనల మేరకు టెండర్ పొందిన సంస్థ..లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో టెండర్ మొత్తంలో 10 శాతాన్ని హెచ్ఎండీఏకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 90 రోజుల్లో మిగతా 90 శాతం నిధులను చెల్లించాలి. అంటే టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ 7,388 కోట్లలో 738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాలి. ఏప్రిల్ 27న హెచ్ఎండీఏ ఐఆర్బీ సంస్థకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మే 26లోపు ఐఆర్బీ సంస్థ 738 కోట్లను చెల్లించాలి.

లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ప్రాజెక్టును 7 వేల కోట్లకే దక్కించుకున్న కేటీఆర్, ఐఆర్బీ, సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్ ధనదాహం తీరలేదు. ఒప్పందాన్ని ఉల్లంఘించి చెల్లించాల్సిన 10 శాతం చెల్లించకుండా ఇంకా సమయం కావాలని ఐఆర్బీ సంస్థ అడుగుతోంది. మా దగ్గర నిధులు లేవు ఇంకో 120 రోజుల సమయం కావాలని ఐఆర్బీ సంస్థ హెచ్ఎండీఏకు ఉత్తరం రాసింది. అయినా ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీర్ ఒత్తిడి తెస్తున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

సంస్థ ఫైనాన్షియల్ స్టేటస్, ఆస్తుల విలువను చూసిన తర్వాతే ఐఆర్బీ సంస్థకు టెండర్ కట్టబెట్టామని కేటీఆర్, కేసీఆర్ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు హడావుడిగా వాయిదాల పద్దతిలో చెల్లించేలా ఐఆర్బీ సంస్థకు వెసులుబాటు ఇచ్చేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇటీవలి కాలంలో వివిధ నిర్ణయాలు విమర్శలపాలు కావటంతో అర్వింద్ కుమార్ సంతకాలు పెట్టడానికి సంశయిస్తుంటే..ఐఏఎస్ అధికారి సంతోష్ స్థానంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ గా పని చేసి రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని హెచ్ జీ సీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) ఎండీగా హడావుడిగా తీసుకొచ్చి అవసరమైన సంతకాలు చేయించారు. గతంలో ఇదే అధికారి తెల్లపూర్లో రూ.10 వేల కోట్ల విలువ చేసే 400 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు నింబంధనలకు విరుద్ధంగా కేటాయింటారు. అప్పటి నుంచి కేటీఆర్, బీఎల్ఎన్ రెడ్డి మధ్య బలపడింది.

ఐఏఎస్ అధికారి సంతోష్ బదిలీ చేసినప్పుడు..టీఎస్పీఎస్సీలో పరీక్షల నిర్వహణకు మంచి అధికారి ఉండాలి అని బదిలీ చేశామని చెప్పారు. మరీ మంచి అధికారి హెజీసీఎల్ కు అవసరం లేదా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారి నిర్వహించాల్సిన బాధ్యతలను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రిటైయి అయిన బీఎల్ఎన్ రెడ్డి ఎందుకు అప్పజెప్పారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిటైర్ అధికారులను ఉపయోగించుకొని ప్రభుత్వ పెద్దలు దోపీడి పాల్పడుతున్నారు అనడానికి ఇదే నిదర్శనమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

టెండర్ దక్కిన వెంటనే ఐఆర్బీ సంస్థ..తన సంస్థలో 49 శాతం వాటాను సింగపూర్ సంస్థకు అమ్మేసింది. ఓఆర్ఆర్ టెండర్ ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే కేటీఆర్ యూకే పర్యటనకు వెళ్లారు. కేటీఆర్ యూకే పర్యటనకు వెళ్లినవారెవరూ? తేజరాజు, రాజేష్ రాజు కేటీఆర్ సింగపూర్ వెళ్ళినపుడు ఎక్కడ ఉన్నారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. పెట్టుబడుల కోసం యూకే, యూఎస్ పర్యటనలకు అంటూ కేటీఆర్ చెబుతున్న మాటల ఆవాస్తవమని రేవంత్ రెడ్డి అన్నారు.

అక్రమ సొమ్మును దాచి పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు. అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు. అందుకే కేటీఆర్ గూడుపుఠానీ సమావేశాలు. ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఇవ్వగానే సింగపూర్ కంపెనీ వచ్చింది. ఆ తరువాత షెల్ కంపెనీలు ముందుకొస్తాయి. షెల్ కంపెనీల వెనక ఉన్న రాజులు ఎవరో.. యువరాజులు ఎవరో తేలాలి అని డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీలోగా ఐఆర్‌బీ సంస్థ నిబంధనల ప్రకారం 10 శాతం నిధులు చెల్లించాలి. లేకపొతే సంస్థ టెండర్లను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి.

ఓఆర్ఆర్ విలువను మదింపు చేసిన మజెల్స్ సంస్థ నిబద్ధతను కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది. 10 శాతం నిధులు చెల్లించలేని ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఎలా ఇస్తారు..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పట్లో నేను సమాచారం హక్కు చట్టం కింద కావాల్సిన సమాచారం కోసం సచివాలయంకు వెళ్తుంటే వేలాది మంది పోలీసులతో నిర్భందించారు. అప్పటి నుంచి హెచ్ఎండీఎ, హెచ్జీసీఎల్ అధికారులను సమాచారం కోసం సంప్రదిస్తూనే ఉన్నా. అయిన కావాల్సిన సమాచారం ఇవ్వడం లేదు.

నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీకీ అధ్యక్షుడిని పార్లమెంటు సభ్యుడిని. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. అయిన నాకు మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. జరుగుతున్న తతంగంపై అరవింద్ కుమార్ వివరణ ఇవ్వాలి. అరవింద్ కుమార్ నాకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వరు..? ఆయన కేవలం కేసీఆర్, కేటీఆర్‌కు మాత్రమే తాబేధారా..? నా పార్లమెంట్ పరిధి చాలా వరకు జీహెచ్ఎంసీలోనే ఉంది. టెండర్ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వకుంటే HMDA, HGCL కార్యాలయాలు ముట్టడిస్తాం. సమాచారం ఇచ్చే వరకు అధికారులను నిర్బంధిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

ఇచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై..టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతిపై కాగ్, సెంట్రల్ విజిలెన్స్, సంబంధిత విచారణ సంస్థలకు, ప్రధాని, హోం మంత్రికి ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంత దారిదోపిడీ జరుగుతున్నా బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రికి ఎందుకు ఫిర్యాదు చేయరు? బండి సంజయ్ ఓఆర్ఆర్ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదు? బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న అవగాహనమేటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ ముసుగులో జరుగుతున్న దోపీడీని ప్రజాక్షేత్రంలో, చట్టపరమై చర్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఓఆర్ఆర్ కు వందలా ఎకరాలున్నాయి. వాటిల్లో కమర్షియల్ యాక్టివిటీ మొదలుపెడితే వేలాది కోట్ల రూపాయాల ఆదాయం వస్తుంది. మరోవైపు హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఇంత తొందరగా ఓఆర్ఆర్ ను అమ్మాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు టెండర్ దక్కించుకున్న సంస్ధ ఇప్పుడు 10 శాతం నిధులు కూడా లేవంటుంది. తమ సంస్థలో వాటాను సింగపూర్ సంస్థకు అమ్మింది. సింగపూర్ సంస్థ ఆ వాటాను పాకిస్థాన్ ఐఎస్ఐ సంస్థకే మరో సంస్థకే అమ్మితే పరిస్థితి ఏమిటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

LEAVE A RESPONSE