రెవెన్యూ లోటు భర్తీని సాధించిన సీఎం జగన్

-రూ.10,461 కోట్ల రెవెన్యూ లోటును విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
-ఎంపీ విజయసాయిరెడ్డి

రాష్ట్ర విభజన చట్టంలోని ముఖ్యమైన హామీ అయిన 2014-15 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సాధించారని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.

కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా గత చంద్రబాబు సర్కారు తేలేకపోయిందన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి చేసిన విజ్ఞప్తులకు కేంద్రం సానుకూలంగా స్పందించి రూ.10,461 కోట్ల రెవెన్యూ లోటును విడుదల చేసిందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పలు అంశాలు స్పందించారు.

జనరంజకంగా సాగుతున్న జగన్ పాలన
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షోభ సమయాల్లో సైతం సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆదుకుంటూ ప్రజల మన్ననలు పొందుతోందని, జగన్ పాలన జనరంజకంగా సాగుతోందని చెప్పారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిలా జగన్ మోహన్ రెడ్డి నిలిపారని చెప్పారు.

పేదలకు పెద్ద చదువులే లక్ష్యం
పేద విద్యార్థులను కూడ పెద్ద చదువులు చదివించాలన్న ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా జనవరి-ఫ్రిబ్రవరి-మార్చి 2023 త్రైమాసికానికి బుధవారం నాడు నిధుల జమ చేశారని చెప్పారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు చేశారని విజయసాయిరెడ్డి అన్నారు.

Leave a Reply