– కేసీఆర్ ఉద్యోగులకు పదివేల కోట్ల బకాయిలు పెడితే మేము ఎనిమిది వేల కోట్ల బకాయిలు క్లియర్ చేశాం
– భవిష్యత్తు తరాలకు మిగులు విద్యుత్తు అందిస్తాం
– ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్మే స్థాయికి ఎదుగుతాం
– అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అచ్చంపేట: దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడు? దెయ్యాలను రాష్ట్ర పులి మేరల నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మరో రెండు దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను ప్రజా ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రజలు వరుస సంక్షేమ పథకాలు, ఉద్యోగ, స్వయం ఉపాధి కార్యక్రమాలతో బాగుపడుతున్నారు. తన దగ్గరకు ఎవరూ రావడం లేదని కెసిఆర్ దుఃఖపడుతున్నాడు. వారు రాష్ట్రాన్ని లూటీ చేశారు.
మేం తెచ్చి ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్ గా మిగులుతుంది. కులగణనను విజయవంతంగా ఎలా పూర్తి చేశారు అని దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణను అడుగుతున్నాయి. 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ఉద్యోగులకు పదివేల కోట్ల బకాయిలు పెడితే… మేము రాగానే అందులో ఎనిమిది వేల కోట్ల బకాయిలు క్లియర్ చేశాం. ఇంకా కొన్ని మిగిలిపోతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి, దశలవారీగా పూర్తి చేస్తామని ఉద్యోగులను ఒప్పించాం. అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల ను సాకారం చేశాం.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ బిల్లు గృహ జ్యోతి పథకంతో రాష్ట్రంలో 90 శాతం మంది కరెంటు బిల్లు చెల్లించాల్సిన పని లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తు తరాలకు మిగులు విద్యుత్తు అందిస్తాం. ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్మే స్థాయికి ఎదుగుతాం.
ఈ వేసవిలో రికార్డు స్థాయిలో అంచనాలకు మించి 17,162 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేసాం.. రీజనల్ రింగ్ రోడ్డు, మూసి పునర్ జీవనం, ప్రతి జిల్లాలో ఉత్పత్తి రంగాన్ని పెంచాలన్న ప్రణాళికలతో కరెంటు డిమాండ్ రాబోయే రోజుల్లో ఇంకా పెరగనుంది. మరో 50 సంవత్సరాలకు కరెంటు డిమాండ్ ప్రణాళికలను తయారు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. 2029 – 30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తాం.
ఎంతటి ఆర్థిక భారం అయినా సరే రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం. కెసిఆర్ 10 సంవత్సరాల్లో నాలుగు ఇల్లు కూడా నిర్మించలేదు