Suryaa.co.in

Features

త్రివేణీసంగమం పేరెలా వచ్చిందంటే..

సరస్వతీ నది అంతర్వాహిని యై ప్రవహిస్తోంది అని మన పురాణాలు…పూర్వీకుల మాటలు నమ్మని వారు …నమ్మే వారు అందరూ చూడండి..
సరస్వతీ నదీమతల్లి ఎలా భూమిలోకి వెళుతోందో..
ఇలా..ఎందుకంటే..వ్యాస భగవాన్ ఆజ్ఞ మేరకు
మహా భారత రచన చేయ సంకల్పించిన వ్యాస భగవాన్ కు ..బద్రీనాధ్ పరిసర ప్రాంతాలు చాలా బాగా నచ్చాయట..
వినాయక స్వామి తో కలిసి మహాభారత రచన చేస్తుంటే..పక్కన ప్రవహించే సరస్వతి నది హోరు వారిని ఇబ్బంది పెట్టేదట ..దాంతో వ్యాస భగవాన్ ..సరస్వతీ నది ని ఆజ్ఞాపించారట.
ఇవాళ్టి నుండి నువ్వు అంతర్వాహిని యై ప్రవహించు…
గంగ..యమున కలిసే సంగమస్థలం లో నీవూ వెళ్లి కలువు అంతర్వాహిని యై…అది అత్యంత పవిత్ర పుణ్యతీర్థమై విరాజిల్లుతుంది…
మీ ముగ్గురి కలయుక తో ఆ ప్రదేశం త్రివేణీ సంగమం అన్న పేరున ప్రసిద్ధి చెందుతుంది అని ఆజ్ఞాపించటంతో.. ఆనాటి నుండి సరస్వతి నది..ఇక్కడ వీడియోలో చూస్తున్న ప్రదేశం నుంచి అంతర్వాహిని యై ప్రవహించటం మొదలు పెట్టింది…
ఇది సనాతన హైందవ ధర్మానికి.. మన మహోన్నత మహర్షుల గొప్ప తనానికి
ప్రత్యక్ష నిదర్శనం..
ఈ వీడియో లో చూడండి..ఈ వింతను చూసి విదేశీయులు సైతం ఆశ్చర్యపోతున్నారు… అదీ మన సంస్కృతి గొప్ప తనం

– వెలగపూడి గోపాలకృష్ణ

LEAVE A RESPONSE