Suryaa.co.in

Andhra Pradesh

నేరస్తులకు పీహెచ్‌డీ ఎలా ఇస్తారు?

-వ్యవసాయ మంత్రిగా వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించినందుకా
– కోర్టుల్లో దాచిన సాక్ష్యాలను దొంగిలించినందుకా?
– TNSF రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పీహెచ్‌డి పట్టా అత్యంత హాస్యాస్పదం. అసలు కాకాణికి పీమెచ్‌డీ పట్టా ఎందుకిచ్చారు? వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసినందుకా? 14, 15 ఆర్ధిక సంఘం నిధులు ఎలా దారి మళ్లించాలి.

పంచాయతీ వ్యవస్థను ఎలా నాశనం చేయాలో లోతుగా విశ్లేషించి, అద్యయనం చేసినందుకు పీహెచ్‌డీ ఇచ్చారా? జగన్ రెడ్డి పంచాయతీల నిధులు కొల్లగొట్టి పంచాయతీలను నిర్వీర్యం చేస్తుంటే.. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు, నూతన సంస్కరణల అంశంపై పీహెచ్‌డీ చేసిన కాకాణి ఎందుకు ప్రశ్నించలేదు?

నిధులు దారి మళ్లించి, చివరికి బల్బులు పెట్టడానికి, సీనరేజి తొలగించడానికి కూడా నిధుల్లేక పంచాయతీలు అవస్థలు పడడమే నూతన సంస్కరణలా? ఇసుకను దోచేస్తున్నందుకు పీహెచ్‌డీ ఇవ్వాలి. కోర్టుల్లో దాచిపెట్టిన సాక్ష్యాలను ఎత్తుకెళ్లినందుకు పీహెచ్‌డీ ఇవ్వాలి.

చట్ట సభలన్నా, వ్యవస్థలన్నా, న్యాయ స్థానాలన్నా కనీస గౌరవం లేకుండా వ్యవహరించే కాకాణిలాంటి వారికి పీహెచ్‌డీ ఇవ్వడాన్ని మించిన ఘోరం ఇంకోటి ఉండదు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇచ్చిన పీహెచ్‌డీ పట్టాను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అప్పుడే విద్యా వ్యవస్థపై సామాన్యులకు గౌరవం పెరుగుతుంది.

LEAVE A RESPONSE