సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యాలి అంటున్నావు.. ఎలా చేస్తావ్?

నేను విగ్రహాలను పూజిస్తే విగ్రహాలను పెకిలించి నాశనం చేస్తావా?
నేను గుడి కట్టుకొని పూజిస్తే గుళ్లను కూల్చి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తావా?
మరి నేను సూర్యుణ్ణి పూజిస్తాను…
దమ్ముంటే సూర్యుణ్ణి పెకిలించు..
నేను చంద్రున్ని పూజిస్తాను
దమ్ముంటే చందున్ని తొలగించు..
నేను అగ్నిని పూజిస్తాను
దమ్ముందా మొత్తం అగ్నిని ఆర్పేయడానికి…
నేను గాలిని పూజిస్తాను…
ధైర్యం ఉందా గాలిని పీల్చకుండా ఉండటానికి..
నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను అంటే..
ప్రకృతిని పూజిస్తాను…
నీకు దమ్ముందా ప్రకృతిని నాశనం చేయడానికి…
నీలాంటి చీడ పీడలు ఎందరో ఎన్నో రకాలుగా సనాతనంను
అంతం చేయాలని చూశారు..
అంతా అంతమయ్యారు..
సనాతనం సగర్వంగా నిలబడుతూనే ఉంది..
సర్వే జనా సుఖినోభవంతు…
ఇలా చెప్పేది సనాతనధర్మం ఒక్కటే

– అన్నదానం వెంకటేశ్వర్లు