Suryaa.co.in

Telangana

స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రత్యేక కార్యక్రమం స్వతంత్ర స్ఫూర్తికి విశేష స్పందన….

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజాధికా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తన వంతు ప్రయత్నంగా యువత లో స్వతంత్ర స్ఫూర్తిని నింపడానికి సామాన్యుని స్వరమే తన గొంతుకగా వచ్చిన స్వతంత్ర న్యూస్ ఛానల్ స్వతంత్ర స్ఫూర్తి పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు స్వతంత్ర సమరయోధుల త్యాగాలను తెలియజేస్తూ వారిలో మరింత స్ఫూర్తి ని నింపుతుంది.ఈ కార్యక్రమం లో భాగంగా ఈరోజు స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమం విశాఖ లోని పైడా డిగ్రీ కళశాల మరియు పైడా మహిళ కళాశాలలో నిర్వహించారు. కళాశాల ప్రాంగణం లో ముందుగా పైడా విద్య సంస్థలు చైర్మన్ పైడా కృష్ణప్రసాద్ జాతీయ జెండా ను ఎగురవేశారు. అనంతరం చైర్మన్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం, స్వతంత్ర సమరయోధుల కోసం విద్యార్థులకు తెలియజేస్తూ స్వతంత్ర న్యూస్ ఛానల్ స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమం తో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.

స్వతంత్ర ఉద్యమ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీతో పాటు పలువురు స్వతంత్ర సమరయోధులకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తమ కుటుంబానికి దక్కిందని తెలియజేశారు. నేటి యువత జాతీయ భావాలను పెంపొందించుకుని దేశ అబివృద్ది కి కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత సంస్థలు స్థాపించి ఉపాధి కల్పిచే దిశగా ఎదగాలని అన్నారు.

అనంతరం పైడా కళాశాలల ప్రిన్సిపల్ డా .సరోజ్, ఎస్ వి ఎస్ ప్రసాద్ లు మాట్లాడుతూ స్వతంత్ర న్యూస్ ఛానెల్ నిర్వహిస్తున్న స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమంపై ప్రశంశల జల్లు కురిపించారు. నాటి యోధుల పోరాటం నేటి యువతకు తెలియజేస్తున్న స్వతంత్ర ఛానెల్ చేస్తున్న కార్యక్రమం అందరికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమంలో పైడా విద్య సంస్థల చైర్మన్ కృష్ణ ప్రసాద్, ప్రిన్సిపాల్స్ డా .సరోజ్, ఎస్ వి ఎస్ ప్రసాద్ , కళాశాలాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

LEAVE A RESPONSE