Suryaa.co.in

Telangana

మరో సియోల్ నగరం కానున్న హైదరాబాద్

– మూసీ ప్రక్షాళనతో కలలకు సాకారం
– భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి

సీయోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఎంపీ చామల తో పాటు తెలంగాణా మంత్రులు,ఎమ్మెల్యే లు అధికారుల బృందం నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో రెండో రోజుకు చేరుకుంది. సీయోల్ లో చెంగిచియాన్ నది,హన్ నదులను పరిశీలించి వాస్తవ పరిస్థితులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ తెలంగాణ అధికారుల బృందం పరిశీలించారు. అక్కడ ఉన్న నదులు వాటి ప్రక్షాళన, అనంతరం చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగంపై రివర్స్ ఫ్రంట్ అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. పర్యావరణం పై దుష్ప్రభావం పడకుండా వ్యర్థాలను పునర్వినియోగం లోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం సియోల్ లో వినియోగంలో ఉందన్నారు. సీయోల్ నగరం నడిబొడ్డు నుండి ప్రవహించే చెంగిచియాన్ నది హైదరాబాద్ మధ్యలో ప్రవహించే మూసి లాగా మురికిమయంగా ఉండేదన్నారు.

నదిని సియోల్ నగర పాలక సంస్థ ప్రక్షాళనతో అత్యంత సుందర నగరంగా సీయోల్ మారిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన మూసినది ప్రక్షాళనతో హైదరాబాదు నగరం మరో సియోల్ గా మారనుందని అన్నారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే పునర్వినియోగం ప్లాంట్లను తెలంగాణా ప్రభుఉత్వం నెలకొల్పుతుందని వివరించారు.

తెలంగాణ ప్రజల భవిష్యత్తుకి మూసి నది ప్రక్షాళన ప్రతిష్టాత్మకంగా మార్చుకొని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని మూసి నదికి పునర్జీవం పోస్తే హైదరాబాద్ మహానగరం కూడా సియోల్ నగరంగా మారనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE