-విజయనగరంలో 20 చోట్ల గతుకుల రోడ్లు
-మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం: అంబేద్కర్ విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చిన విషయం తనకు తెలియదని, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో గతుకులడిన 20 రోడ్లు గుర్తించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 93 కోట్లుతో టెండరు పిలుస్తామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 27 రోడ్లు గుర్తించామని చెప్పారు. ఒక్క ఆర్ అండ్ బి పరిధిలో 50 కిలోమీటర్లు రోడ్డు పాడైనట్టు గుర్తించామని చెప్పారు. బాగు కోసం టెండర్లు పిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో 270 స్కూల్స్ లో విలీన సమస్య ఉన్నట్టు కూడా గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. ఏఏ స్కూల్స్‌తో సమస్య వుందో తెలియచేయని సంబంధిత శాసనసభ్యులను కోరామన్నారు.