– సీనియర్ నాయకులకు పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది
– ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్ ను నిర్ణయించలేవు
– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హుజురాబాద్ ఉప ఎన్నిక పార్టీ కార్యకర్తలను నిరాశపరిచాయి.ఒక ఉప ఎన్నిక ఫలితాల వల్ల పార్టీ కార్యకర్తలు నిరాశచెందకండి. పార్టీ అభ్యర్థి వెంకట్ నిరాశ చెందాల్సిన అవసరం లేదు- వెంకట్ కు మంచి భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీకి వెంకట్ మంచి లీడర్ అవుతారు. హుజురాబాద్ ప్రజల కోసం భవిష్యత్తు లో పోరాటం చేస్తాడు.
హుజురాబాద్ ఎన్నికల ఫలితాలపై సంపూర్ణమైన భాద్యత నాదే. నివేదికలు తెప్పించుకొని విశ్లేషన చేసుకుంటాం. రాబోయే రోజులన్ని కాంగ్రెస్ పార్టీవే. ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా కొట్లాడుతాం. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగాయి. ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్ ను నిర్ణయించలేవు. గత ఎన్నికల్లో బిజెపి కి 16వందల ఓట్లు మాత్రమే వచ్చాయి- ఇప్పుడు గెలిచింది. మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలో బీజేపీ కనిపించలేదు.
మీ కోసం నేను ఉంటా- ఈ ఓటమి నన్ను కుంగదియ్యదు. ఈ ఫలితాలు- హుజురాబాద్ ఎన్నికపై భవిష్యత్ స్పందిస్తా. ఈ ఓటమి నిరాశ శాశ్వతం కాదు- నిరాశ నుంచి నిర్మాణం చేపడుతాం. కాంగ్రెస్ లో సీనియర్ నాయకులకు పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. పార్టీ విషయాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటాం. సీనియర్లు పార్టీ కార్యక్రమాల్లో కలుపుకుని వెళతాం.