విశాఖ ఉక్కు వైఎస్సార్సీపీని ఇరుకున పెట్టబోతుందా?

విశాఖపట్నం ఉక్కు ఉద్యమానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని నాయకత్వం వహించమని, మద్దతివ్వమని కార్మిక సంఘాలు కోరడం, ఆయన లక్షలాది మంది జన సైనికులతో మీటింగ్ ఏర్పాటు చేయడం , అది గ్రాండ్ సక్సెస్ కావడం ఇది రాష్ట్ర ప్రజల్లో కొంతమందికి సంతోషం ,కొంతమందికి ఆక్రోశం రావడం మనం ఊహించవచ్చు.
అయితే ఆ మీటింగ్ లో ఆయనను ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరిన ఉద్యమకారులు, కార్మిక సంఘాల నాయకులు ఒకరకంగా నిరుత్సాహనికి గురయ్యారు. ఎట్లా అంటే వారు కోరుకుంది.. వారు భావించింది .. కేంద్ర ప్రభుత్వాన్ని ,మోడీని పవన్ కళ్యాణ్ ఇరుకున పెట్టే మాటలు మాట్లాడతారు, విమర్శలు చేస్తారు, ఉద్యమానికి నాంది పలుకుతారని ఊహించారు.
కానీ పవన్ కళ్యాణ్ నేను రాజకీయం చేస్తాను అనే ప్రకటనలో భాగంగా ప్రజలనుద్దేశించి.. మీరు 151, 22 సీట్లతో వైఎస్ఆర్సిపిని గెలిపించారు. అధికారం వారిది. వారి నాయకత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. అన్ని పార్టీలను పిలిచి సమస్యను చర్చిద్దాము. అధికార పార్టీని వారం రోజులలో ఈ పని చేయమని సభాముఖంగా ప్రకటన చేశారు.
అందరమూ కేంద్రం దగ్గరకు పోయి… ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మన సమస్యని ,మన అవసరాన్ని, ఫ్యాక్టరీ చరిత్రను ,దాని కోసం బలిదానం చేసిన ప్రజల గురించి, భూములు ఇచ్చిన రైతులు గురించి అన్ని విషయాలు అందరం కలిసి చర్చిద్దాము అని చెప్పడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమేనని ప్రజల భావిస్తున్నారు. వైయస్సార్సీపి ఉద్యమానికి కలిసి రాకపోతే, ప్రజలలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తే, గతంలో వారు చేసుకున్న చీకటి ఒప్పందాలు బహిర్గతమవుతాయి. వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారయింది.
కేంద్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మాలని నిర్ణయం చేసినప్పుడే, కేంద్రం రాష్ట్రానికి తెలియజేసిన విషయం కొంత మందికి తెలుసు. దానిని కొనడానికి కొరియా దేశానికి చెందిన పోస్కో కంపెనీ వారు వచ్చి , ముఖ్యమంత్రితో రెండుసార్లు చర్చలు జరిపిన విషయం.. వారికి విశాఖపట్నంలో స్టీల్ ఇండస్ట్రీకి కొంత భూమిని అలాట్ చేసిన విషయం.. ప్రస్తుత ఫ్యాక్టరీ ఉద్యోగస్తులను, కార్మికులను ఏమి చేయాలి? ఆస్తి విలువ ఎంత ఉంటుంది? ఇదంతా తయారుచేయడానికి ఒక కమిటీని ,ఒక ఏజెన్సీని నియమించిన విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు .
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించిన గంగవరం పోర్టు… రాష్ట్ర ప్రభుత్వం వాటా 10.8% కూడా 680 కోట్లకు అమ్మిన విషయం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ,రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముగ్గులోకి లాగారు. పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర ప్రభుత్వ పాలసీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, పెట్టుబడి ఉపసంహరించుకోవడం (డిజిన్వెస్ట్మెంట్) ఇది కేంద్రం పాలసీ అనే విషయం వారికి కూడా తెలుసు .
కానీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అనేది భావోద్వేగాలతో ముడిపడి ఉన్నదనే విషయాన్ని, రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఉందని కాబట్టి…. మోడీ ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సానుకూలమైన వాతావరణంలో ,మంచి దృక్పథంతో దీనిని అమ్మకుండా ఉంచాలనే తలంపు బలంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. తద్వారా ఫ్యాక్టరీని లాభాల బాటలో పరుగెత్తించడానికి రాష్ట్రం ఏమి చర్యలు తీసుకోవాలో, కేంద్రం ఏమి సహాయం చేయాలో అనే విషయం చర్చించాలని వారి ఉద్దేశ్యం కావచ్చు. ఇదే జరిగితే అటు బీజేపీకి, ఇటు జనసేనకు ,ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషం కలుగుతుంది .ఇదే జరిగితే బాధపడేవారు ,ఇష్టం లేనివారు, కష్టపడే వారు కూడా లేకపోలేదు. కానీ భగవంతుని దయవల్ల అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం.

– కరణం భాస్కర్
బి జె పి, నెల్లూరు
7386128877.

Leave a Reply