Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి వైసీపీ ఎమ్మెల్యే నేనే

– ఆర్కే

మగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని ఆర్కే పేర్కొన్నారు. అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని తెలిపారు. తాను కేవలం బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని వెల్లడించారు. కాగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే.

LEAVE A RESPONSE