దళిత మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి

-జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది
-పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితులు పరారయ్యారు
-అత్యాచారానికి గురైన బాలికకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

మంగళగిరి: విశాఖపట్నంలో దళిత మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరుమెదకపోవడం దారుణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రామయ్య ఒక ప్రకటన విడుదల చేస్తూ… విశాఖపట్నంలో మైనర్ బాలికపై జరిగి అఘాయిత్యంపై ముఖ్యమంత్రి జగన్ సిగ్గుతో తలదించుకోవాలి.

రోజులతరబడి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీశారు. అత్యంత అవమానవీయమైన ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే విశాఖ ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులు వేరే రాష్ట్రానికి పారిపోయారు.

ఎన్ సిఆర్ బి నివేదిక ప్రకారం రాష్ట్రంలో మహిళలపై 1,48,578 నేరాలు జరిగాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగన్ పాలనలో మహిళలపై నేరాలు 43% పెరిగాయని, దేశం మొత్తమ్మీద మహిళలపై నేరాల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని చెప్పారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య వైసిపి ప్రభుత్వానికి పలు సూటిప్రశ్నలు సంధించారు.

1). విశాఖ ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులను ఇప్పటికీ ఎందుకు అదుపులోకి తీసుకోలేదు?
2).రాష్ట్రంలో మహిళలకు ఎందుకు రక్షణ లేదు? మన సోదరీమణులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైంది?
రాష్ట్రంలో మహిళల భద్రతకు టీడీపీ కట్టుబడి ఉంది. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి.
బాధితురాలిపై రోజులతరబడి సామూహిక అత్యాచారం జరుగుతున్నా…పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం., ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షీణించిన మహిళల భద్రతపై సీఎం జగన్ రెడ్డి లేదా ఆయన అనుచరుల వద్ద సమాధానాలు ఉన్నాయా అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు, దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. దళితులపై దాడులు, అత్యాచారాల్లో దేశం మొత్తమ్మీద ఎపి ప్రథమస్థానంలో ఉందని తెలిపారు. జగన్ ప్రభుత్వం రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో దళితులు రాష్ట్రంలో ఉండాలా, పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లాలో చెప్పాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.

విశాఖపట్నంలో సామూహిక అత్యచారానికి గురైన దళిత బాలికకు రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఘటనపై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి, నిందితులపై సమయాన్ని వెచ్చించకుండా సివియర్‌గా విచారించాలి.

Leave a Reply