Suryaa.co.in

Features

భారత రత్న అవార్డు

భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం ఈ భారత రత్న అవార్డు.
భారత రత్న అవార్డు అందుకున్న తొలి భారతీయుడు డా.చక్రవర్తుల రాజగోపాలాచారి.
వీరు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రపతి పదవి ఏర్పడే వరకు భారత దేశానికి
వైస్రాయ్ ( గవర్నర్ జనరల్ ) గా వ్యవహరించారు.

మనకు బ్రిటన్ స్వాతంత్య్రం ప్రకటించినప్పుడు గవర్నర్ జనరల్ గా వున్నది ఆంగ్లేయుడు అయిన లార్డ్ మౌంట్ బాటెన్. భారత ప్రభుత్వం ఇద్దరు విదేశీయులకు ఈ భారత రత్న అవార్డును ప్రదానం చేసింది. ఒకరు భారత్ – పాకిస్తాన్ విభజనను వ్యతిరేకించిన పాకిస్తాన్ ప్రాంతం లో జన్మించిన అబ్దుల్ గఫార్ ఖాన్. ఇతనిని పాకిస్తాన్ దేశం బహిష్కరణ చేయటం వలన మరణించే వరకు భారత్ లోనే కాలం గడిపారు.

ఇంకొకరు దక్షిణాఫ్రికా జాతీయుల కోసం ( వలస వెళ్ళిన భారతీయులు కూడా వున్నారు ) అహర్నిశలు పోరాటం చేసి దాదాపు 25 సంవత్సరాలు( 1963 – 1988 వరకు ) తన యవ్వన దశను చెరసాల లో గడిపిన నెల్సన్ మండేలా కు కూడా భారత ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రదానం చేసింది.

మరి ఈ జనవరి 26 న భారత రత్న అవార్డు ఎవరిని వరించనున్నదో చూడాలి.

– చింతపల్లి వెంకటరమణ

LEAVE A RESPONSE