ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడు
వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారు
హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడు
కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇచ్చాడు
రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చాడు
వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది
ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం
వైఎస్సార్ బ్రతికి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యే వారు
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గా నేను నిలబడుతున్న. వైఎస్ బిడ్డ నిలబడుతుంది. ఈ నిర్ణయం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని చీలుస్తుంది అని తెలుసు. వైఎస్సార్ అభిమానులను గందరగోళంలో పడేలా చేస్తుంది అని తెలుసు. అయినా తప్పని సరి పరిస్థితిలో తీసుకున్న నిర్ణయం.
జగన్ మోహన్ రెడ్డి నా ఆన్న. అన్న అంటే నాకు ద్వేషం లేదు. జగన్ మోహన్ రెడ్డి నా రక్తం. ఎన్నికల్లో నన్ను చెల్లే కాదు బిడ్డ అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడు. ఈ జగన్ మోహన్ రెడ్డి నాకు పరిచయం లేదు. సీఎం జగన్ నా అనుకున్న వాళ్ళను అందరినీ నాశనం చేశాడు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడు. కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇచ్చాడు. ఇదే తట్టుకోలేక పోయా.
హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదు. హత్య చేసిన వాళ్ళు,చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవు. అధికారం వాడుకొని వాళ్ళనే జగన్ రక్షిస్తున్నాడు. అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తున్నాడు. మళ్ళీ అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడం తట్టుకోలేక పోయా. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారు. మాకు చాలా ఆలస్యంగా అర్థం అయింది.
సాక్షి చానెల్ తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. ప్రజలు హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇస్తే హర్షించరు అని తెలిసి మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు. వైఎస్సార్,వివేకా రామ లక్ష్మణుడి లా ఉండేవాళ్ళు. వివేకా ఆఖరి కోరిక నన్ను ఎంపీగా చూడాలని. ఎప్పుడు నాకు అర్థం కాలేదు నన్ను ఎందుకు ఎంపీగా ఉండమని అడిగారో. ఇవ్వాళ అర్థం అయ్యింది.
సునీత న్యాయం కోసం గడప గడప కి తిరుగుతుంది. న్యాయం కోసం ఎక్కని మెట్టు లేదు. నేను హత్యా రాజకీయాలకు విరుద్ధం. ఒక హంతకుడు పార్లమెంట్ మెట్టు ఎక్కకూడదని ఈ నిర్ణయం తీసుకున్న. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని ముంచారు. రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు. మద్యం ఏరులై పాలించాడు. ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతుంది.
ఇవాళ ఘాట్ వద్ద నివాళులు అర్పించి వారి ఆశీస్సులు తీసుకున్నాం. వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ తరుపున వైఎస్సార్ 10 ఎన్నికల్లో గెలిచాడు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీలో నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రిగా ఎదిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఏర్పాటుకు తనవంతు సహకారం ఇచ్చాడు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీనే మంచిది అని నమ్మిన వ్యక్తి వైఎస్సార్.
వైఎస్సార్ బ్రతికి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యే వారు. వైఎస్సార్ కల నెరవేరేది. నాన్న ఆశయం కోసం ఇవ్వాళ నేను పార్టీలో చేరా. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఇవ్వాళ 5 మంది ఎంపీలు,114 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేశాం. మరో రెండు,మూడు రోజుల్లో తుది జాబితా సైతం విడుదల అవుతుంది.
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి జగన్,బాబు ఏనాడూ పని చేయలేదు. ఒక్క ఉద్యమం చేసింది లేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. రాష్ట్రం ఇవ్వాళ దీన స్థితిలో ఉంది. దీనికి కారణం బాబు,జగన్. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు. రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి. విభజన హామీలు నెరవేరాలి అంటే కాంగ్రెస్ రావాలి.