వైసీపీని పెకిలించి వేద్దాం

నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య

వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించి వేద్దామని నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య పిలునిచ్చారు. పట్టణంలోని కాకాని నగర్‌లో మంగళవారం కూటమి పార్టీల నేతల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ తొర్లికొండ సీతారామయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోట వీరబాబు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

తంగిరాల సౌమ్య మాట్లాడుతూ… నాన్న సామాన్య కార్యకర్తగా పార్టీలో అంచలంచలుగా ఎదిగి ఎమ్మెల్యేగా నందిగామ నియోజక వర్గానికి ఆయన ఎన్నో సేవలు చేశారన్నారు. ఆయన అకాల మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన నన్ను సొంత ఆడపడుచుగా అభిమానిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో అనకొండ మొండితోక సోదరులు రాఘవపురం పల్లగిరి గట్లను, గుట్టలను, కొండలను దోచేశారన్నా రు. నాలుగు రోడ్ల విస్తరణ చేసి అభివృద్ధి అంటున్నారని, ఏంటి మీరు చేసిన అభివృద్ధి? అని ప్రశ్నించారు. దోచేసిన డబ్బులు తాయిలాలుగా ఇవ్వబోతున్నారని, ఇచ్చిన డబ్బులు తీసుకుని తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చందర్లపాడు గ్రామం నుంచి ఇరుకులపాటి ఇనయ్య టీడీపీలో చేరగా ఆహ్వానించారు.

Leave a Reply