Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల్లో ఉండి సేవ చేసే వారినే గెలిపించుకోవాలి

-మాటిస్తున్నా పల్నాడుకు తాగు, సాగునీరు ఇస్తాం
– గోదావరి అనుసంధాన ప్రాజెక్ట్‌, గోవిందాపురం లిఫ్ట్‌లు బాగు చేయిస్తాం
– మాచవరంలో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి నీరందిస్తాం
– టీడీపీ వస్తే చేసే మంచిని గడపగడపకు వివరించండి
– నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు,
గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు
– మాచవరం మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం

పల్నాడులో తాగు, సాగు నీరందక రైతులు, ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, అధికారంలోకి రాగానే నీరిచ్చే బాధ్యత తనదని, ఇందుకు మాటిస్తున్నానని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మాచవరంలో మంగళవారం మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. వచ్చే ఐదేళ్లు తమ లక్ష్యం పల్నాడులో నీటి ప్రాజెక్టులు పూర్తి చేయటమేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది రైతులు పంటలకు నీరందక ఇబ్బంది పడ్డారని, ఇది పరిష్కారం అవ్వాలంటే.. ఇప్పటికే చంద్రబాబు శంకుస్థాపన చేసిన గోదావరి అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాల్సిన అవసరం ఉందన్నారు.

మాచవరం మండలంలో గోవిందాపురం వద్ద లిఫ్ట్‌లు బాగు చేయించి దీన్ని గంగిరెడ్డి పాలెం వరకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. రూ.15.50 కోట్లతో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తామని మాటిచ్చారు. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి టీడీపీ ప్రతిష్టత్మకంగా కొన్ని పథకాలను అమలు చేయబోతున్నట్లు వివరించారు. ముఖ్యంగా వైసీపీ దళితులకు రద్దు చేసిన 27 పథకాలను పునరుద్ధరిస్తామని వెల్లడిరచారు. పతి నాయకుడు, కార్యకర్త మనం చేయ బోయే అభివృద్ధి, మంచిని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని, అప్పుడ విజయం వరిస్తుందని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా అందుబాటులో ఉండే వారినే ఎన్నుకోవాలని సూచించారు.

గడిచిన ఐదేళ్లలో నిత్యం అందుబాటులో ఉన్నానని, మున్ముందు కూడా ఇలాగే ప్రజలకు సేవ చేస్తానని మాటిచ్చారు. మాచవరం మండలం లోని గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకుంటూ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. గ్రామాల్లో వారు కోరిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం లో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE