– నందిగామ పట్టణ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
వావివరసలు లేని విచక్షణ జ్ఞానం లేని ఒక సైకోతో నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నాం.జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను చేసే అసత్య ప్రచారాలను జనం నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు ఇతని పరిపాలనతో విసిగిపోయి ఉన్నారు.
అడ్డదిడ్డంగా అయినా సరే అధికారంలోకి రావాలని చివరి అవకాశం అంశంగా ఈ ఓటర్ లిస్ట్ పై జగన్ రెడ్డి ప్రతాపం చూపించనున్నాడు. దొంగ ఓట్లను చేర్చడం తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించాలని చూస్తున్నారుప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తస్మాత్తు జాగ్రత్తగా ఉండాలి.
బూతులు తిట్టించుకున్నాము,కేసులు పెట్టించుకున్నాము, దెబ్బలు తిన్నాము పోరాటాలు చేసాము ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని ఉద్యమాలు చేశాము.సైకో ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని దోచేశాడు. ఇప్పుడు దొంగ ఓటుతో దెబ్బతీయాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు.పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉంటుంది,ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను.
గతంలో అభివృద్ధిని,సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు అనుకున్నాము. కానీ ఒక్క ఛాన్స్ మాయలో పడి అందరూ మోసపోయారు.బడుగు,బలహీన వర్గాలకు పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నందిగామ పట్టణంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వార్డులలో సిమెంటు రోడ్ల వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది మీరేం చేశారో చెప్పగలరా ఓపెన్ చాలెంజ్.బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని చెప్పుకోవడం తప్పా వారికి ఒరిగింది చేసింది ఏమీ లేదు
డివిఆర్ కాలనీ,ఉమా కాలనీ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ.ఒక ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ ఈ నియోజకవర్గంలో ఉండి వారి నిధులు తీసుకురాకుండా కంపెనీలు ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ ను ఆర్భాటంగా తాము ఏదో గొప్ప పనిగా చేసినట్లు భావించి నానా హంగామా చేశారు చివరికి అవి కూడా ఆ రోడ్లు కూడా మూలన పడేశారుసిఎస్ఆర్ ఫండ్స్ అంటూ ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి వారి ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేశారు.
మొండితోక బ్రదర్స్ కి ఓపెన్ ఛాలెంజ్ మీ కాసుల కక్కుర్తి కోసం లేని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 80 లక్షల రూపాయలు ఖర్చు చేశారు, మీ అధినేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వాటర్ ఫౌంటెన్ కి నందిగామ గాంధీ సెంటర్లో 18 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం నిజం కాదా, సింగిల్ టెండర్ తో 40 లక్షల రూపాయల పెట్టి కాలువలు నిర్మించారు.
ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోతున్నాయి ఉన్న లెవెల్ కి ఎత్తులో కట్టడం వలన నీరు పారడం లేదు మీరు కట్టిన నిర్మాణం మొత్తం వృధానే, ఇవన్నీ మీ కాసుల కక్కుర్తి కోసం కాదా? దీనిపై బహిరంగంగా ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పగలిగే దమ్ము మీకుందా?
నందిగామ కు నాలుగు దిక్కుల నీళ్లు ఉన్న త్రాగునీటి సరఫరాలో వైసీపీ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. దూర ప్రాంతాలకు అందరికీ నీరు అందించాలని లక్ష్యంతో మేము 87 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు తీసుకొని వస్తే మీరు అలసత్వం చేసి కనీసం కోటి రూపాయల పనిని కూడా చేయలేకపోయారు నీరు అందించలేకపోయారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును కూడా మీరు చేయలేకపోయారు. మీ చేతకానితనాన్ని మరియొకసారి రుజువు చేసుకున్నారు
ఆర్డబ్ల్యూఎస్ నీటి బిల్లులను కోట్లాది రూపాయల బకాయిలను ఇప్పటికీ చెల్లించలేకపోయారు అవి అలానే పేరుకుపోయాయి.వాటర్ ట్యాంకుల వారికి బిల్లులు చెల్లించక సొంత పార్టీ ట్యాంకర్ల వారే ధర్నా చేసే పరిస్థితి మీ పార్టీలో ఉంది.
రోడ్లు విస్తరణకు అడ్డంగా ఉన్నాయని చెట్లను అడ్డదిడ్డంగా నరకటం మరలా చెట్లను నాటడానికి స్థలం కూడా లేకుండా చేయడము,పైప్ లైన్ అపగ్రేడేషన్ చేయకుండా రోడ్లు వేయడం దాని వలన రోడ్డు కృంగిపోవడం రోడ్ల నిర్మాణాలలో ఎన్నో అవినీతి కుంభకోణాలు. ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్కలాగా రోడ్డు నిర్మాణం చేపట్టడం వైసీపీ పార్టీ పెద్ద వైఫల్యం.
గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో పారిశుద్ధ్య పనుల నిమిత్తం నాలుగు ట్రాక్టర్లు ఒక కంపాక్టర్, బాప్కార్డ్ మినీ జెసిబి తదితర వాహనములు అప్పుడు కొన్నవే తప్పితే ఇప్పుడు కొత్తగా కొన్నది కూడా ఏమీ లేదు.ఆటోలు తీసుకువచ్చారు వినియోగంలోకి రాలేదు అట్టహాసంగా ఫోటోలు దిగటానికి తప్పితే ప్రజానీకానికి కలిగిన ప్రయోజనం ఏమీ లేదు.
ఆసుపత్రిలో అన్నింటిని సక్రమంగా నిర్వర్తిస్తూ, సరైన సిబ్బందిని పరికరాలను ఏర్పాటు చేయండి తరువాత ఆలోచిద్దాం వంద పడకల ఆసుపత్రి గురించి. ఉన్న ఆసుపత్రికే సరైన దిక్కు లేదు నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా పేదవాడు కార్పొరేట్ స్థాయిలో జీవించాలనే లక్ష్యంతో జి ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి 80 శాతం పనులు పూర్తయిన ఫ్లాట్లకు కేవలం మీరు రంగులు వేసి ఇచ్చేవాటిని తాత్సారం చేసి ఈరోజు లబ్ధిదారులందరినీ రోడ్డు మీద పడేశారు
జి ప్లస్ త్రీ స్థలాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అనా సాగరంలో జగనన్న కాలనీలు అంటూ మునిగిపోయిన స్థలాలు ఇచ్చారు దీనిపై మేము ప్రశ్నిస్తే మా మీద అసభ్యకరమైన విమర్శలు చేశారు. ఇప్పుడు వరదలు వచ్చాక దాని పరిస్థితి ఏంటి? జగనన్న లేఅవుట్లు అంటూ స్మశానాలలో, వాగులలో,చెరువులలో,కుంటలలో మునిగిపోయే స్థలాలను ఇస్తున్నారు మొదటి నుంచి మేము అదే చెబుతున్నాము.
గతంలో దీనిపై మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే మాపై ఘాటుగా విమర్శలు చేశారు అప్పుడు వరదలలో, మరల మొన్న వచ్చిన వరదలలో స్థలాలు మునిగిపోయాయి మరల పునరావృతమైన దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ గారు?
గత తెలుగు దేశ ప్రభుత్వ హయాంలో అన్ని లైట్లు తీసి ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడం జరిగినది. వీరు అధికారంలోకి వచ్చి చేసింది కూడా ఏమీ లేదు వాటికి సరైన సమయంలో బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారు.
ఎస్సీ ఎస్టీ, బిసి, మైనారిటీ వార్డులకు మేము ఎంత కేటాయించామో మీరు వచ్చాక 15 ఫైనాన్స్లో వారి అభివృద్ధికి మీరు ఎంత కేటాయించారో చెప్పండి. అని చాలెంజ్ చేస్తే మీ నుంచి ఎటువంటి సమాధానం లేదుమీకు కమిషన్లు తెచ్చి పెట్టే ప్రాజెక్టుల్ని వెంటనే హడావుడిగా చేస్తారు.
అందుకు ఉదాహరణ 80 లక్షలు పెట్టి కేంద్ర విద్యాలయానికి కానీ 40 లక్షలు పెట్టి రైతు బజార్లో కానీ అదే విధంగా 40 లక్షలు పెట్టి సింగిల్ టెండర్ పెట్టి డ్రైనులు చేశారుఅదే విధంగా బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడే జగ్జీవన్ రావు గారి బిల్డింగ్ ని పునర్నిర్మాణం చేయటానికి ఎందుకు అలసత్వం చూపిస్తున్నారు.
అంటే ఇక్కడే తెలిసిపోతుంది మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్లు మీకు కమీషన్లు వచ్చే మాత్రమే చేస్తారు కానీ బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే పనులను మాత్రం చేయరు.కాసులకు,కమీషన్లకు కక్కుర్తి పడి లేని పోయిన వాటన్నింటికీ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి మీ జేబులు నింపుకోవడం నిజం కాదా?ఈ దుర్మార్గులకు, వీరి అన్యాయాలకు,అక్రమాలకు చరమగీతం పాడే ఒకే ఒక ఆయుధం ఓటు
ప్రతి తెలుగుదేశం పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్, యూనిట్ మరియు క్లస్టర్ ఇంచార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ శక్తి వంచన లేకుండా కష్టపడదాం. వైసిపి పార్టీని బంగాళాఖాతంలో కలిపేవరకు నిద్రపోకుండా పోరాడుదాంప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. మీ వైసీపీ పార్టీకి,మీ నేతలకు, మీకు త్వరలోనే ప్రజానీకం తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
ప్రపంచ దేశాలు గర్వించదగిన నేత నారా చంద్రబాబునాయుడు గారికి ప్రతి విషయంపై పూర్తి సమాచారం ఉంది.నారా చంద్రబాబునాయుడు నాన్నగారి నిస్వార్ధత,పనితనాన్ని మా కుటుంబం యొక్క పనితత్వాన్ని గుర్తించి, నాన్నగారి నిస్వార్థ సేవను గుర్తించి మళ్లీ మా కుటుంబానికి సీటు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మన అందరి లక్ష్యం ఒకటే మళ్లీ నమ్మకంతో నారా చంద్రబాబునాయుడు ఏదైతే ఈ అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వొమ్ము చేయకుండా అందరం కష్టపడదాం. నేను నాతో పాటు మీరందరూ కూడా కష్టపడి ఇక్కడ గెలిచి నారా చంద్రబాబునాయుడు కి ఈ గెలుపును బహుమానంగా ఇద్దాం.