తమ కుట్రలను ఎదుటి వారికి అంటగట్టి తప్పించుకోవడం జగన రెడ్డి ముఠా నైజం

– అలిపిరి బాంబ్ బ్లాస్ట్, పరిటాల రవి హంతకులతో జగన్ రెడ్డి చేతులు కలిపినట్లు ఆరోపణలు
– జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019 ఆగస్టులో గంగిరెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది?
– కోడికత్తి కేసును అలిపిరి బాంబు బ్లాస్ట్‌తో ముడిపెట్టడం జగన్ రెడ్డి కుట్రల నుండి ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడ కాదా?
– పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

కోడికత్తి శ్రీనివాసరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్ రెడ్డి ఫోటోతో కూడిన ఫ్లెక్సీ వేశాడు. అతను జగన్ రెడ్డి వీరాభిమాని అని స్వహస్తాలతో రాసిన 11 పేజీల లేఖ రుజువు చేసింది. కోడికత్తి శ్రీనివాసరావుకు ఏ రకంగా కూడా తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదని ఎన్ఐఏ తన కౌంటర్ పిటిషన్‌ పేరా నెం.6లో స్పష్టం చేసింది. వ్యవస్థల్ని మేనేజ్ చేయగల అధికారం, రూ.2 లక్షల కోట్ల అవినీతి డబ్బు జగన్ రెడ్డి దగ్గర ఉంది తప్ప.. టీడీపీ వద్ద లేదు.

తన అవినీతి కేసులో నాలుగేళ్లుగా కోర్టు వాయిదాలకు హాజరవ్వడం లేదంటే ఎవరికి వ్యవస్థల్ని మేనేజ్ చేసే శక్తి ఎవరికి ఉందో దీన్ని బట్టి అర్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌లకు లభించని మినహాయింపు జగన్ రెడ్డి ఎలా పొందారు? తన అవలక్షణాలను, అడ్డదారుల్ని ఎదుటి వారికి అంటగట్టి తన దొంగ బుద్ధుల్ని కప్పిపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నేరస్తులకు జగన్ రెడ్డి అనుచరుడు ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి సెల్‌ఫోన్లు సరఫరా చేసినట్లు రుజువైంది. అలిపిరి బాంబ్ బ్లాస్ట్, పరిటాల రవి హంతకులతో జగన్ రెడ్డి చేతులు కలిపినట్లు ఆరోపణలున్నాయి. కొల్లం గంగిరెడ్డి ఎర్రచందనం కేసుల్లో కడప జైల్లో ఉండగా, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019 ఆగస్టులో బెయిల్ ఎలా వచ్చింది?

26 ఎర్రచందనం కేసులు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన కేసులున్న వ్యక్తికి జగన్ రెడ్డి ప్రభుత్వ లాయర్ల సహకారం లేకుండా బెయిల్ ఎలా సాధ్యమైందో పేర్ని నాని సమాధానం చెప్పాలి. కొల్లం గంగిరెడ్డి కుటుంబం వైసీపీలో కొనసాగుతోందన్న విషయం వాస్తవం కాదా? కోడికత్తి శ్రీను గానీ, అతని కుటుంబం గానీ టీడీపీలో లేదు. అలిపిరి బాంబు బ్లాస్ట్ కేసును కోడికత్తి కేసుతో ముడిపెట్టడం బోడిగుండుకు మోకాలికి ముడివేసే ప్రయత్నం కాదా? జగన్ రెడ్డి అధికార దాహానికి దళిత యువకుడి భవిష్యత్ నాశనమైంది. కోడికత్తి, వివేకానందరెడ్డి గొడ్డలి వేటు అధికార క్రీడలో పావులు కావా?

Leave a Reply