-స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం
-లోకేష్ సమక్షంలో 200మంది టిడిపిలో చేరిక
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. మంగళగిరి పట్టణ ప్రముఖ బిసి నేత ఆకురాతి నాగేంద్రం సహా 200 కుటుంబాలు యువనేత నారా లోకేష్ సమక్షంలో సోమవారం ఉండవల్లి లోని నివాసంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారందరికి యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగేంద్రంతో పాటు గోలి నాగార్జున, కొల్లి వెంకటరమణ, కాసుల వేణు, కాటాబత్తుల విజయ్, పెంటపాటి రవి, మునగాల శ్రీనివాస్, వద్ది వసంత, ఆకురాతి శ్రీను, చీపురి వెంకటేశ్వరరావు, నాగులపల్లి వెంకటరత్నం తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… బంగారు నగల పేరు చెబితే మంగళగిరి గుర్తొచ్చేవిధంగా మంగళగిరి ప్రాంతాన్ని గోల్డ్ హబ్ గా తీర్చిదిదుతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటాం అని చెప్పారు. కోవిడ్ సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అనేక విధాలుగా సేవ చేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 29 సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. గతంలో మంగళగిరికి ఐటీ కంపెనీలు తీసుకువచ్చానని, మళ్లీ అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున ఐటి కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని చెప్పారు. చేనేతలను అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి ఇచ్చిన అన్ని హామీలన్నీ నెరవేర్చి తీరుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్ధయ్య, తమ్మిశెట్టి జానకీదేవి, దామర్ల రాజు, షేక్ రియాజ్, గోవాడ దుర్గారావు, జగ్గారపు రాము, మండ్రు రాము, చిలకా వెంకటేశ్వరరావు, గుంటి నాగరాజు, వంగర రమేష్, కాశిన కొండలు, వడిశ నరేష్ తదితరులు పాల్గొన్నారు.