– కార్యకర్తలే పార్టీకి పునాది
– మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం: తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని, కార్యకర్తలే పార్టీ పునాదులని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం రూరల్ మండల నాయకులు, కార్యకర్తల సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పాల్గొని మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నీతి, నిబద్ధతకు మారుపేరని, పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు.