Suryaa.co.in

Telangana

కేటీఆర్ కు ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

– కేకే ని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటాం
– కేటీఆర్ కు దమ్ముంటే కొడంగల్ లో ఒక జడ్పీటీసీ లేదా ఎంపీపీ గెలవాలి
– రాజీనామా కు రేవంత్ రెడ్డి అవసరం లేదు.. నేను సిద్ధం
– కేటీఆర్ అబద్దాల పుట్ట
– పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్ :గతంలో నేను కేటీఆర్, హరీష్ రావు కు అసెంబ్లీలోనే రాజీనామా సవాల్ విసిరాను.రాజీనామా పైన కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు స్పందించలేదు.కేటీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కేకే మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటాం.

ఆరిపోయే దీపం లా కేటీఆర్ మాట్లాడుతున్నారు. జైలుకు పోతామన్న భయంతోనే ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి మనుషులను తీసుకెళ్లి దారి పొడువునా కేటీఆర్ షో చేస్తున్నాడు.పగటి వేషగాడి లా కేటీఆర్ మాటలున్నాయి.

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ నాడు కొడంగల్ ను పట్టించుకోలేదు. లక్ష రూపాయల రుణమాఫీ కూడా సరిగా చేయకుండా రైతులను దగా చేశారు.కొడంగల్ యువతకు ఉపాధి కల్పించడం కోసం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తుంటే బీఆర్ఎస్ దుష్పచారం చేసింది. కలెక్టర్ ను చంపించడానికి సురేష్ అనే వ్యక్తితో ప్రయత్నం చేయించారు.

పారిశ్రామిక వాడ కోసం భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా లేఖలు ఇస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి 20 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నాం. అసైన్డ్ భూములకు కూడా ఎకరానికి 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నాం.ప్రతి రైతు కు అభివృద్ధి చేసిన 150 గజాల ప్లాట్ ఇస్తున్నాం.. దీని వల్ల 15 లక్షలు భూములు ఇస్తున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాం.. కుటుంబానికో ఉద్యోగం ఇస్తున్నాం.

కొడంగల్ కు ఇప్పటికే మెడికల్ కాలేజ్ మంజూరు అయింది.. ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేశాం. కొడంగల్ అభివృద్ధి కోసం 6,128 కోట్ల రూపాయలను కేటాయించాం. కొడంగల్ లో మా రేవంత్ రెడ్డిని ఓడించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అనేక శిలాఫలకాలు వేసి వదిలేసింది.

బీఆర్ఎస్ హయాంలో మా జిల్లాలో ఒక డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు.. ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. 45 వేల కోట్లతో ఒకే రోజు నాలుగు పథకాలను మా ప్రభుత్వం తీసుకువచ్చింది. కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదు.. కేటీఆర్ చెల్లెలు ఇప్పటికే తీహార్ జైలుకు పోయి వచ్చింది. కేటీఆర్ పైన ఎసీబీ, ఈడీ విచారణ జరుగుతోంది. కేటీఆర్ అబద్దాల పుట్ట. మా సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదు. నా నియెజకవర్గంలో రుణమాఫీ పైన నేను ఛాలెంజ్ చేస్తే కేటీఆర్ నోరు మెదపలేదు..

LEAVE A RESPONSE