Suryaa.co.in

Andhra Pradesh

3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి

– నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని

(వాసు)

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందులో భాగంగా తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ చెప్పే రెడ్ బుక్ గురించి మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రెడ్ బుక్ చూడలేదు అని, అందులో తన పేరు ఉందో లేదో తెలియదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తమ ప్రభుత్వం కాబట్టి యాక్టివ్ గా మాట్లాడాం, ఇప్పుడు మా ఉద్యోగాలు పోయాయి (ఎమ్మెల్యేలుగా ఓడిపోయాం) ఇంకేం మాట్లాడతాం?. ఈ అరెస్టులు ఇవన్ని చాలా చిన్న విషయాలన్న కొడాలి నాని, తమ మీద 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

వైసీపీ ఐదేళ్ల పాలలో తప్పు చేసిన వారి పేర్లను తన రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నానని గతంలో నారా లోకేష్ పలుమార్లు అన్నారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు లోకేష్ మాటల్ని అంతగా పట్టించుకోలేదు.

కూటమి అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలు, అక్రమ కేసులపై ఫోకస్ చేస్తున్నాం. వారి అవినీతిని బయటకు తీస్తామని నారా లోకేష్ సహా టీడీపీ అన్నారు. ఈ క్రమంలో ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది కొడాలి నానినే అని, రెడ్ బుక్ లో ఆయన పేరు ఉందని టీడీపీ నేతలు వైరల్ చేశారు. త్వరలోనే నారా లోకేష్ రెడ్ బుక్ లో కొడాలి నాని పేరు తీస్తారని, మాజీ మంత్రి అరెస్ట్ తప్పదని కూటమి నేతలు చేసిన కామెంట్లపై తాజాగా ఆయన స్పందించారు.

LEAVE A RESPONSE