ముఖ్యమంత్రే రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా మాట్లాడితే, ఇకప్రజలకు దిక్కెవరు?
– మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రే రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా మాట్లాడితే, ఇకప్రజలకు దిక్కెవరు? డీజీపీ, ఎస్పీలు ముందరే ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి మావోయిస్ట్ లా, ఉగ్రవాదిలా మాట్లాడారు. పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పించకుండా, వైసీపీకి, ముఖ్యమంత్రికిఎస్కార్ట్ లా మారింది. బాధితులు న్యాయంకోసం పోలీసులనుఆశ్రయిస్తే, స్టేషన్లలో వారిపైనేకేసులుపెడుతున్నారు.
బాధింపబడినవారికి రాష్ట్రంలోన్యాయం జరగడం లేదు. వైసీపీఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులే టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని సీసీటీవీ దృశ్యాలు స్పష్టంచేస్తున్నాయి. దాడిచేసినవారు కళ్లముందే కనిపిస్తున్నా, టీడీపీ ఫిర్యాదుచేసినా, పోలుసులు ఎందుకు వారిని అరెస్ట్ చేయలేదు? ముఖ్యమంత్రే వద్దనిచెప్పారా?
పొరుగరాష్ట్రాల పోలీసులు రాష్ట్రంలోని గంజాయిస్థావరాలపై దాడిచేసేవరకు ఏపీ పోలీస్ ఏంచేస్తోంది? బీహార్, పశ్చిమబెంగాల్ పోలీసులకంటేదారుణంగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దిగజారింది. ముఖ్యమంత్రికి అప్పులుచేయడం, దాడులుచేయించడం ఒక్కటే తెలుసు. ఈ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఇలానే వ్యవహరిస్తే, ప్రజలేతిరగబడతారు.