– వెన్నా బాలకోటిరెడ్డిది ప్రభుత్వ హత్యే
– ఎమ్మెల్యే గోపిరెడ్డి కనుసన్నల్లోనే బాలకోటిరెడ్డి హత్య
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
సీఎం జగన్ కి ప్రజలు పాలించమని అధికారమిస్తే రాష్ట్రంలో గూండాయిజం, రౌడీయిజాన్ని ప్రోత్సహించి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. జగన్ రౌడీ పాలన పల్నాడులో మరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను బలి తీసుకుంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిని వైసీపీ గూండాలు కాల్చి చంపారు.
బాలకోటి రెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. బాల కోటిరెడ్డిపై వైసీపీ గూండాలు గతంలో రెండు సార్లు హత్యాయత్నం చేసినా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకుంది నిందితుల్ని గాలికొదిలేసింది. కోటిరెడ్డికి ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేసినాఎలాంటి రక్షణ కల్పించలేదు. పోలీసుల, ప్రభుత్వ వైఖరి వల్లే ఈ హత్య జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పల్నాడులో గన్ కల్చర్ ని ప్రోత్సహిస్తున్నారు. బాల కోటిరెడ్డి గతంలో పలుమార్లు దాడికి పాల్పడ్డ వైసిపినేత వెంకటేశ్వరరెడ్డికి గోపిరెడ్డి ఆశ్రయిమచ్చారంటే వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీ కార్యకర్తల్ని చంపేందుకు సహకరిస్తున్నారని తేటతెల్లమవుతోంది. బాల కోటి రెడ్డి హత్యలో నిందితుల్ని, హత్య చేయించిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. జగన్ అండతో రెచ్చిపోతున్న వైసీపీ గూండాల్ని వదిలేది లేదు. బాల కోటిరెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది.