ఎవరెస్టు శిఖరమెక్కినంత సంబరాల్లో బీసీ వర్గాలు

– సామాజిక న్యాయంలో దేశానికే జగన్ మార్గదర్శి
– జగన్‌ రుణం తీర్చుకోలేం…
– సామాజిక విప్లవానికి తెర తీసిన సీఎం
– బాబు హయాంలో రాజ్యసభ, శాసనమండలి సీట్ల అమ్మకం
–ః రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ …

సామాజిక విప్లవం, సామాజిక న్యాయం ఆంధ్ర ప్రదేశ్‌ నుంచే మొదలయిందని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వం నిరూపిస్తోంది. జగన్‌ మా పట్ల చూపిన ప్రేమ వెలకట్టలేనిది. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. శాసనమండలికి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించిన స్థానాలను చూసి, ఎవరెస్టు పర్వతమెక్కినంత ఆనందంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పొంగిపోతున్నారు. వార్డు మెంబరుగా కూడా పోటీపడలేని మా వర్గాలను ఉన్నతమైన శాసనమండలిలో అడుగుపెట్టేలా చేసిన జగన్‌ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటామని వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన మా పట్ల చూపుతున్న ప్రేమను చూస్తే… నిండుమనసుతో మేం ఆరాధించాలి. ప్రేమించాలి. ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్‌కు సీఎం గా ఉన్నారంటే జయహో జగనన్న అంటూ ఆంధ్రావని అంతా నినదిస్తోంది.

బాబు హయాంలో సీట్ల అమ్మకమే….
టీడీపీ హయాంలో చంద్రబాబు… శాసనమండలి, రాజ్యసభ స్థానాలను అమ్ముకుంటే ఎన్ని కోట్లు వస్తాయా? ఎన్ని సూట్‌ కేసులు వస్తాయా? అని ఎదురు చూసేవాడు. ఈ పెత్తందారీ పోకడలకు వ్యతిరేకంగా జగన్‌ ఒక జాలరి, ఒక వడ్డెర, ఒక కల్లుగీత కార్మికుడు…ఇలా సామాజిక వృత్తులు చేసుకునే వారందరినీ ఈ రోజు శాసనమండలిలో సగౌరవంగా..సముచిత స్థానమిచ్చి కూర్చోబెడుతున్నారు. ఈ రోజు జగన్‌ చూపించే ప్రేమాభిమానాలను ఇతర రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఇంతగా సామాజిక న్యాయం చేసిన నాయకుడు దేశంలోనే ఇంకెవరూ లేరని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నాయకులు ఉప్పొంగిపోతున్నారు.

బడ్జెట్‌ సమావేశాల్లో చర్చకు వస్తావా బాబూ…
చంద్రబాబూ… ఆ రోజు నీ భార్యను ఎవరూ ఏమీ అనకపోయినా…అన్నారంటూ సభ నుంచి పారిపోయావు. రోడ్లమీదికొచ్చి పనికిమాలిన సొల్లు కబుర్లు చెబుతున్నావు కదా…రేపు రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో బీసీలకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చకు రావాలని కోరుతున్నాను. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి రా…
-2014–19 వరకు వీరందరికీ ఏం చేశావో, 2019 నుంచి 2023 వరకు మా ముఖ్యమంత్రి జగన్‌ ఏం చేశారో చర్చించుకుందాం. చర్చ నిర్వహిస్తే ఎవరేం చేశారో తేలిపోతుంది. ఆ చర్చలోనే నువ్వు ఈ సామాజిక వర్గాలకు ఏమీ చేయలేదన్న విషయం బట్టబయలై… నువ్వు బట్టలూడదీసుకుని పారిపోయేలా చేస్తామని నిన్ను హెచ్చరిస్తున్నాను.

దేశమంతటికీ జగన్‌ మార్గదర్శి….
సామాజిక న్యాయం జగన్‌మోహన్‌ రెడ్డి తోనే సాధ్యం. ఈ రోజు అందరూ ఆంధ్రావైపు చూస్తున్నారు. సామాజిక న్యాయం అంశంలో.. అన్ని పార్టీలు, అందరు ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీలు సైతం జగన్‌ బాటలో నడవాల్సిన పరిస్థితి. మనసు నిండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను నింపుకుని ఆ ప్రేమను రుచి చూపిస్తున్నారు జగన్‌ . ఎప్పుడో జ్యోతిరావు ఫూలే కలలు కన్న సామాజిక న్యాయాన్ని 75 ఏళ్ల భారత చరిత్రలో ఆంధ్రాలో మాత్రమే అమలయిందని అందరూ చెప్పుకుంటున్నారు.

టీడీపీలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బాబుకు తొత్తులుగా మారొద్దు…
టీడీపీలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. జగన్‌ గారిని అనుసరించండి. మీరంతా బాబు పెత్తందారీ పోకడలను పక్కన బెట్టండి. బాబుకు తొత్తులుగా మారొద్దు. బాబును ఛీకొట్టాలి. ఉమ్మేసి బయటకు రావాలి. ఇన్ని కులాలు శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశాన్ని ఏనాడైనా మీరు కల్పించారా? అని బాబును
ప్రశ్నించాలని మిమ్మల్నందరినీ కోరుతున్నాను.
– 14 ఏళ్లలో ఏమీ చేయలేని చవట సన్నాసి చంద్రబాబు ఇప్పుడొచ్చి ఏదో పొడిచేస్తానంటాడు. ఈ పిల్లకుక్క లోకేశ్ నోటికొచ్చినట్లు వాగుతాడు…మీరు పొర్లుదండాలు పెట్టినా,
మీ మొహం ఒక్కరంటే ఒక్కరు కూడా చూడరు. అయినా మిమ్మల్ని జనం ఎందుకు చూస్తారు? ఎందుకు చూడాలి?
– బాబు కొడుకువైనంత మాత్రాన నిన్ను జనం అక్కున చేర్చుకుంటారా… ఎన్ని యాత్రలు చేసినా, టీడీపీ కి రాజకీయ సమాధి ఖాయం. పొత్తులు పెట్టుకుని, మూకుమ్మడిగా వచ్చినా జగన్‌ ని ఏం చేయలేరు.
– విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ, మహిళా సాధికారత వంటి వాటికి అసలైన అర్థం జగన్‌ ప్రభుత్వంలోనే రుచి చూస్తున్నాం.
– డీబీటీ ద్వారా రూ.2 లక్షల కోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదలకు అందుతోంది. ఈ రోజు ప్రతి గడపలో అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తోంది. ఎక్కడో ఒక్కచోటే ఇదంతా ఇచ్చేస్తే ఆ లబ్ధి బాబు సామాజిక వర్గానికి, ఆయన తాబేదారులకు మాత్రమే లభించేది.
– సీఎం బటన్‌ నొక్కి ఫీజు రీయింబర్స్ మెంటు ఇస్తే.. మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారు. ఇదంతా ప్రతి గడపకు మనం చెప్పాల్సిన తరుణమిది.

జగన్‌ అడుగులో మనం అడుగేయాలి…
– జగన్‌ పక్షాన ప్రతి ఒక్కరూ అడుగు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాను. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై బాబు ఎప్పుడూ విషమే చిమ్ముతున్నాడు. అలాంటి చంద్రబాబు మన జగనన్న ప్రభుత్వాన్ని కూలదోస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు… బాబును, టీడీపీని కూకటి వేళ్లతో పెకలించడానికి మన వర్గాలన్నీ ఏకం కావాలి. మనందరం జగన్‌ ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
– ప్రతి కుటుంబం జగనన్నకి అండగా, ఆయన పక్షాన ఉంది. జగననన్నతోనే అందరూ ప్రయాణిస్తారు. సామాజిక విప్లవకారుడు, సమాజానికి భావితరాలకు సామాజిక న్యాయాన్ని రుచి చూపించి, చరిత్ర పుటల్లో వైఎస్‌ జగన్‌ పేరు 200 ఏళ్ల తర్వాత కూడా సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని చెబుతున్నారు. జగన కి మరొక్కసారి సెల్యూట్‌ చేస్తూ…అభినవ ఫూలే జగనన్న కు మనందరం రుణపడి ఉండాలని చెబుతున్నాను.

Leave a Reply