Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ విభజన హామీ చట్టాలను అమలుపరిచి రాష్ట్రంలో అడుగుపెట్టండి ప్రధాని గారు

-విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ను ఆపకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుంది…..
-APCC అధికార ప్రతినిధి షేక్ సైదా

రాష్ట్ర విభజన జరిగి దాదాపు 8 సంవత్సరాలు పూర్తి అయినపార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాలను అమలుపరచకుండా ఉద్దేశపూర్వకంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకొని విశాఖ వస్తున్నారో చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేడు పొదిలిలో జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి ప్రభుత్వం విధానాలను తీవ్రంగా విమర్శించారు.

గత 600 రోజులుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున చేస్తున్న ఉద్యమాల పట్ల ప్రధాని మోడీ స్పందించకపోవడం దురదృష్టకరమని, మోడీ మెడలు వంచుతామని ప్రగల్ బాలు పలికిన జగన్ పార్టీ నాయకులు ఆ విషయం మరిచి ప్రధానమంత్రి కి మోకరిల్లి నిస్సిగ్గుగా మోడీ పర్యటనకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని, విశాఖ ఉక్కు, రైల్వే జోన్ కోసం మంత్రి పదవులు, ఎంపీ ,ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేస్తామన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు నోరు మెదపకుండా మూడు రాజధానులకు అనుకూలంగా రాజీనామాలు చేస్తామని జగన్ పార్టీ మంత్రులు ,ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడటం సిగ్గుచేటని సైదా తీవ్రంగా విమర్శించారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖకు ప్రైవేటీకరణ జరగకుండా ఆపవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని దేనని ,అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడాలని సైదా అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటేకరణ వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసు తో బలవంతంగా అరెస్టు చేయించడం దుర్మార్గమైన చర్యని ఆయన తీవ్రంగా విమర్శించారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రధాని మోడీ మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రగల్బాల్ పలికి, ఇప్పుడు కిక్కురు మన కొండ ఉండడంలో ఆంతర్యం ఏమిటనే సైదా సూటిగా ప్రశ్నించారు.

స్వయానా మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన అమరావతి రాజధానికి రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని, గత 1059 రోజులుగారాజధానికి భూములు ఇచ్చిన రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే జగన్ ప్రభుత్వం పోలీసులు ఉక్కు పాదంతో అణచి వేస్తుందని ఈ విషయమై ప్రధాని నోరు తెరిచి మాట్లాడి తన ప్రధాన పదవికి వన్నె తేవాలని లేనిపక్షంలో దేశ చరిత్రలో మోడీ చరిత్రహీనుడుగా మిగిలిపోతారని సైదా ధ్వజమెత్తారు.

LEAVE A RESPONSE