– 66 వేల మందికి సరకులు పంపిణీ
-పారిశుధ్య పనులు 78 శాతం పూర్తి
-వరద ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా నాలుగు అడుగుల నీరు
– సీఎం చంద్రబాబు
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఎలా వచ్చాయో విచారణ చేస్తున్నామని, కుట్ర కోణం ఉంటే ఎవరిని ఉపేక్షించమని హెచ్చరించారు బుడమేరును ఐదేళ్లుగా అన్యాయంగా కబ్జా చేశారని, పులిచింతల, గుండ్లకమ్మ గేట్లను పట్టించుకోకపోవడంతో సమస్యలు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద మళ్లీ ప్రవాహం పెరుగుతుందని, విజయవాడలో వర్షాలు పడటంతో వరద పరిస్థితి విషమించిందన్నారు.
వరద ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా నాలుగు అడుగుల నీరు ఉన్నట్లు తెలిపారు. బుడమేరు కు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ, కేంద్రం నుంచి రూ.6,880 కోట్లు సహాయం కోరినట్టు చెప్పారు.
వరద బాధితుల కోసం నిత్యావసరాలు, ఆహారం, మంచినీరు అందిస్తున్నామని, 66 వేల మందికి సరకులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.ఈ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు 78 శాతం పూర్తయ్యాయని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ ఇవ్వడం లేదన్నారు.
క్యాంపులు, హోటళ్లు, కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలికంగా బాధితులను ఆశ్రయిస్తామని, ఉపాధి అవకాశాల కోసం కొన్ని కంపెనీలతో చర్చిస్తున్నామని చెప్పారు.