ఆయన పార్టీ అధ్యక్షుడిగా కంటే.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మొనగాడు. పాలనంటే ఆయనకో యజ్ఞం. సంక్షోభాలను సవాలుగా కాదు. అవకాశంగా మార్చుకునే కార్యదక్షుడు. ఏం చేసినా అందులో కసి ఉంటుంది. పట్టుదల కనిపిస్తుంది. అందుకే ఆయన ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. అందులో రెండో ముచ్చటే లేదు. ఇవీ.. ఏపీ సీఎం,టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుగురించి జనసామాన్యంలో వినిపించే మాట.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అసలైన ఆచరణాత్మక నిర్వచనాన్ని గత 5 రోజులుగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విత్ ప్లాన్డ్ కోర్దినేషన్ !?
డిజాస్టర్ మ్యానేజ్మెంట్ అంటే ఏంటి ?
క్రైసిస్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు ?
అనేవి మన రాష్ట్రంలో అమలౌతున్న విధానాన్ని దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.
భారతదేశ చరిత్రలో మొదటిసారిగా… కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో..
వరద విపత్తుల సమయాల్లో డ్రోన్లను ఉపయోగించి ఆహారం అందించడం. ఫైరింజన్లతో వరద బాధితుల ఇళ్లు, పరిసరాలు శుభ్రం చేయడం. వరదల్లో మునిగి పాడైన వాహనాల భీమా క్లైమ్ లు చెల్లించే విధంగా ఐఆర్డీఏ ద్వారా చర్యలు తీసుకోవడం. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి రోబోటిక్ లైఫ్ బోట్ ని ప్రయోగాత్మకంగా పరిశీలించడం.
ఇవి కాక… కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా, డిజాస్టర్ మ్యానేజ్మెంట్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, వివిధ మాధ్యమాల ద్వారా వస్తున్న ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ పరిష్కారిస్తూ, 180 కి పైగా వాటర్ ట్యాంకర్లను ఒకేసారి సిద్ధం చేసి,మొత్తం అధికార యంత్రాంగాన్ని నీరు, ఆహారం, మందులు అందించే సహాయక చర్యల్లో వినియోగిం చడం.
బుడమేరు వాగుకి పడిన గండ్లు పూడ్చే పనులు 24 గంటలూ కొనసాగించి…వరద బాధితుల సహాయక చర్యలను ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు.సంక్షోభాలను సవాలు చేసే నాయుడి నాయకత్వంలో !
ఈ 5 ఏళ్లలో దేశానికి దిక్సూచిలా మన రాష్ట్రం నిలిచేలా.. మరెన్నో ఘనతలు సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ..
– తీగల రవీంద్ర