Suryaa.co.in

Features

మనకు తెలియని గోవా మారణకాండ

– గోవా భయంకరమైన చరిత్ర

గోవా ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది, అందమైన సముద్ర తీరాలు, విహార యాత్రలు, హనీమూన్ లు. కానీ ఆ అందమైన సముద్రాల వెనుక మనకి తెలియని, మనకి చెప్పని ఒక భయంకరమైన చరిత్ర ఉంది.

మరణ భయంతో వేలాది మంది యొక్క చావు కేకలు, తమ ధర్మం కోసం చివరిదాకా నిలబడి మరణ శిక్షలు విధించబడి, శవాలుగా మారిన వేలాది ప్రాణాలు, వేల మంది జైళ్లలో చీకటిలో మగ్గిన జీవితాలు ఉన్నాయి. ఆ వేలాది మంది ఎవరో కాదు, గోవాలో స్థానిక హిందువులు. గోవాలో వేలాది హిందువుల జీవితాలు నాశనం కావటానికి కారణం — ఒక మతం, అదే క్రైస్తవమతం !

భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన వచ్చిన క్రైస్తవులు (పోర్చుగీసు, dutch, బ్రిటిష్ etc). వీళ్లంతా వ్యాపారం పేరుతో వచ్చి ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకొని, స్థానిక రాజుల మధ్య గొడవలు పెట్టి అధికారం చేజిక్కించుకునే భారతదేశాన్ని ఆక్రమించారు.

అలా పోర్చుగీసు వాళ్లు గోవాని ఆక్రమించుకున్నాక, అక్కడి గోవా ప్రజల్ని తమ క్రైస్తవ మతంలోకి మార్చాలని పొర్చీగీసు వాళ్ళు ఒక్క కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు దాని పేరు గోవా ఇంక్విజిషన్.1542 లో ఫ్రాన్సిస్ జేవియర్ అనే పాస్టర్, ఈ గోవా ఇంక్విజిషన్ అనే చట్టం రావడానికి ముఖ్య కారకుడు.

ఈ ఫ్రాన్సిస్ జేవియర్ పోర్చుగీసు రాజు అయిన జాన్ – 3 ఇలా అడిగాడు..
గోవాలో ఉన్న కొంతమంది క్రైస్తవులు సరిగ్గా క్రైస్తవ మత ఆచారాలు పాటించడంలేదని.. వారిని దారిలో పెట్టాలంటే, గోవాలో క్రైస్తవ మత నిలబడాలంటే, కఠినమైన చట్టం కావాలని, అందుకు గోవా ఇంక్విజిషన్ తప్పనిసరి అని, దాన్ని గోవాలో అమలుచేయాలని ఆ రాజును కోరాడు.ఆ తర్వాత ఫ్రాన్సిస్ జీవియర్ చనిపోయిన 8 సంవత్సరాల తర్వాత గోవాలో ఆ భయంకరమైన చట్టం అమలులోకి వచ్చింది.

ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం,గోవాలో ఉన్న హిందువుల్ని భయపెట్టి, ప్రలోభ పెట్టి, హింసించి వాళ్లందరిని క్రైస్తవ మతంలోకి మార్చాలి.

1560 – 1820 వరకు గోవాలో గోవా ఇంకవిజిషన్ అమలు అయ్యింది. అంటే దాదాపు 300 సంవత్సరాలు అని మాట !

గోవా ఇంకివిజిషన్ లోని ముఖ్యమైన విషయాలు ఇవి..
గోవాలో సంస్కృతం, మరాఠి, కొంకణి భాషలో ఉన్న సాహిత్యాన్ని, హిందూ మత గ్రంధాలని అగ్గిలో వేసి తగలబెట్టడం !

హిందువుల కుటుంబాల్లో బిడ్డ యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఒకళ్ళు చనిపోతే చాలు, ఆ పిల్లల్ని చర్చి, పాస్టర్ వాళ్ళు తీసుకొని వాళ్లని క్రైస్తవ మతంలోకి మారుస్తారు. కొన్నిసార్లు వాళ్ళ కుటుంబ ఆస్తిని కూడా చర్చ్ వాళ్ళు జప్తు చేసుకునేవారు.!

గ్రామంలో ఉండే అధికారులు అందరూ క్రైస్తవులే ఉండాలి, హిందువులు గ్రామ అధికారులుగా ఉండడానికి అనర్హులు !

గ్రామ సభలలో నిర్ణయాలు తీసుకునే అధికారం హిందువులకు లేదు. నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం క్రైస్తవులకు, క్రైస్తవ మతంలో వారికి మాత్రమే ఉండేది.

కోర్టులో హిందువులు చెప్పే సాక్ష్యం చెల్లదు. క్రైస్తవులకు మాత్రమే సాక్ష్యం చెప్పే అధికారం ఉంది, వాళ్ళు చెప్పిన సాక్ష్యము చెల్లుతుంది.

ఎక్కడైనా సరే హిందువుల గుడి, మందిరాలు ఉంటే వాటిని వెంటనే కూల్చేయాలి ! గుడిని కూల్చి వాటి స్థానంలో చర్చిలు కట్టుకునేవారు.

హిందువులు హిందు దేవతా విగ్రహాలను కలిగి ఉండడం పెద్ద నేరం. హిందువులు ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటే వాళ్ల ఆస్తి, డబ్బు అంతా చర్చి వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు. హిందువులు వారి పండగలు, శుభకార్యాలు జరుపుకోకూడదు.

గోవా ప్రజలు అందరూ వాళ్ళ మాతృభాష అయిన కొంకణి మాట్లాకూడదు, అందరూ ఖచ్చితంగా పొర్చిగీసు భాష మాత్రమే మాట్లాడాలి.

ఫ్రాన్సిస్ జీవియర్ హిందువుల్ని ఉద్దేశించి ఇలా అన్నాడు “హిందువులు జాతి అపవిత్రమైన జాతి. వారు నల్లగా ఉంటారు, అసహ్యంగా ఉంటారు. హిందువులు పూజించే విగ్రహాలు దెయ్యాలు. వాటినుండి నూనెతో కూడిన అసహ్యమైన వాసన వస్తుంది”

పోర్చుగీసువారు చెప్పినట్టు క్రైస్తవ మతంలోకి మారకపోతే హిందువుల్ని రకరకాల చిత్రహింసలు పెట్టేవారు. వాటిలో ముఖ్యంగా హిందువుల్ని బతికి ఉండగానే మంటల్లో వేసి కాల్చేయడం. బతికుండగానే చర్మము వలిచేయటం. మర్మాంగాలలోకి పదునైన వస్తవులతో గాయాలు చేయటం. ఈటెలతో గుచ్చి చిత్రవధ చేయడం, హిందువుల్ని తాళ్లతో కట్టి వారి నాలుక కోసేయటం. కళ్ళలో కాల్చిన ఇనుప చువ్వలు పెట్టి కంటిచూపు పోగొట్టడం. మతం మారని హిందువుల యొక్క పసిపిల్లల కాళ్లు చేతులు విరిచేయడం.

హిందువులు ఇంట్లో దేవుని విగ్రహాలు కలిగి ఉంటే కలిగి ఉంటే హిందువులకి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష.

హిందువుల ఇంట్లో తులసి మొక్క కలిగి ఉండటం నేరం. జంధ్యం వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం లాంటివి కూడా నేరం వాటిక్కూడా జైలు శిక్షలు ఉన్నాయి.

విసరి ఆంటీనియో డి నోరహ అనే పాస్టర్ గోవా ఇంక్విజిషన్ లో భాగంగా ఓ కొత్త చట్టం చేశాడు. ఆ చట్టం ప్రకారం హిందువుల దేవాలయాలను మూసివేయాలి. కొత్త దేవాలయాలు కట్టకూడదు. పాత దేవాలయాలకి మరమ్మతులు చేయకూడదు. అలాగే హిందు దేవాలయాల్లో వుండే బంగారం మరియు డబ్బు చర్చ్ ఆధీనంలోకి రావాలి.

1620 లో అదే పాస్టర్, హిందువులు పెళ్లి చేసుకోవడం నేరం, వాళ్లు క్రైస్తవం స్వీకరిస్తే పెళ్లి చేసుకోవాలి లేదంటే వాళ్లు జీవితాంతం ఒంటరిగా మిగిలి పోవాలి అనే చట్టం చేశాడు. దానివల్ల మతం మారని హిందువులు పిల్లలు లేక అంతరించిపోతారు అని అతడి ప్లాన్.

ఈ గోవా ఇంక్విజిషన్ చట్టంలో పైన చెప్పబడిన ఘోరాలు దాదాపు 300 సంవత్సరాల పాటు హిందువుల మీద జరిగాయి.ఈ క్రూరమైన చట్టము వల్ల వేలాదిమంది హిందువులు బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చి వేయబడ్డారు.

వేలాదిమంది హిందువులు సజీవదహనానికి, మరణశిక్షకు గురయ్యారు.

మరికొంతమంది తమ ఇల్లు ఆస్తి కోల్పోయారు. వేలాది హిందూ మందిరాలు గుడిలు కూల్చబడ్డాయి !

మరికొంతమంది హిందువులు ఈ క్రైస్తవ మతోన్మాదులు పెడుతున్న ఈ హింస తట్టుకోలేక గోవా వదిలిపెట్టి, గర్భగుడిలోని దేవుని విగ్రహం పట్టుకుని వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోయేవాళ్లు.

ఇప్పటికి మనం గోవా లో గమనిస్తే ఆ చర్చ్ ల పునాదుల హిందువుల సమాదులు మీద, దేవాలయాలని కూల్చి కట్టిన చర్చ్ లు ఎన్నో కనిపిస్తాయి.

ఇప్పటికి గోవా వెళ్లిన కొంతమంది అమాయకులు ఈ భయంకరమైన చరిత్ర తెలియక, ఈ దుర్మార్గానికి కారకుడు అయిన ఫ్రాన్సిస్ జీవియర్ యొక్క సమాధికి, శరీరానికి ప్రార్థన చేస్తారు.

సేకరణ: విశ్వేశ్వర ప్రసాద్

LEAVE A RESPONSE