గత కొన్ని రోజులుగా ప్రభుత్వ బలగాలు నక్స్‌లైట్స్‌ను లేకుండా చేస్తూ వస్తున్నట్టు వరుస సమాచారం వస్తోంది. దేశానికి జరుగుతున్న అవసరమైన పెనుమేలు ఈ పరిణామం.
నక్సలైట్స్ నిర్మూలనను ఒక ధ్యేయంగా తీసుకుని కేంద్ర ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితోనూ తీక్ష్ణంగానూ పనిచేస్తోంది. దేశ హోమ్ మంత్రి గౌరవనీయ అమిత్ షా ఈ విషయంగా చెప్పింది చేస్తున్నారు. ‘నక్స్‌లైట్స్‌ను లేకుండా చెయ్యడం అన్న పెను మేలును’ దేశానికి చేస్తున్నారు అమిత్ షా. అందుకు ఆయనకు కృతజ్ఞత.
70-80 దశాబ్దుల్లోనే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, అప్పటి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే నక్సలిజం వల్ల సగటు పౌరులకు, పలు కుటుంబాలకు, పలువురు కన్న తల్లులకు, దేశానికి జరిగిన అత్యంత బాధాకరమైన హాని జరిగి ఉండేది కాదు.
మనదేశానికి కమ్యూనిజమ్ తరువాత తగిలిన అతి పెద్ద దెబ్బ నక్సలిజమ్. చంపడం, దాడి చెయ్యడం, దోచుకోవడం, నాశనం చెయ్యడం, కన్న తల్లుల కడుపులు కొయ్యడం, బాగా బతికి రాణించాల్సిన వ్యక్తుల బతుకుల్ని ఛిద్రం చెయ్యడం, కష్టంతో, స్వయం కృషితో ఎదిగిన వాళ్లను, తమ పనితనంతో పదిమందికి ఉపాధి కల్పించిన వాళ్లను హింసించడం నక్సలిజం ఫలితాలుగా, పర్యవసానాలుగా సమాజంలో నమోదయి ఉన్నాయి. సగటు మనిషికి నక్సలిజమ్ వల్ల జరిగిన మేలంటూ లేదు.
ఒక మనిషి తనకు తాను భయంకరమైన కీడు చేసుకోవడం నక్సలైట్ అవడం! నక్సలైట్ అవడం అతి ప్రమాదకరమైన మానసిక వ్యాధి. కమ్మూనిజమే ఒక పెను మానసిక వ్యాధి; నక్సలిజమ్ అంతకన్నా విపరీతమైనది.
ఈ మేరకు రానివ్వకుండా నక్సలిజంను మొగ్గలోనే తుంచేసి ఉండచ్చు. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ పనిని తొలిదశలోనే చెయ్యలేదు. పర్యవసానంగా సగటు వ్యక్తులకు, సమాజానికి, దేశానికి ఎంతో హాని జరిగింది.
70-80 దశాబ్దుల్లో తమిళ్ష్‌నాడు ముఖ్యమంత్రి ఎమ్. జీ. రామచంద్రన్ చిత్తశుద్ధితో, వజ్రసంకల్పంతో, దార్శనికతతో రాష్ట్రంలో నక్సలిజంను మొగ్గలోనే నిర్మూలించేశారు! నక్సలిజం నిర్మూలనలో ఎమ్.జీ. రామచంద్రన్ పనితీరు బహుధా ప్రశంసనీయం (ఇప్పటికీ). ఎమ్.జీ. రామచంద్రన్ వంటి ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు నక్సలిజంవల్ల పెద్ద దెబ్బే తిన్నాయి.
విధ్వంసకారులు, హింసావాదులు అయిన నక్స్‌లైట్స్ తెలుగులో ప్రజా గాయకులు, ప్రజా కవులు, ప్రజా కళాకారులు కూడా అయిపోయారు. ఈ వికృత పరిస్థితి ఏ ఇతర భాషలోనూ లేదు. ప్రజలను హింసించే, ప్రజలను దోచుకునే, ప్రజా విరోధులు ప్రజల్లో లేనివాళ్లు ప్రజా కళాకారులు అవుతారా? ప్రజా గాయకులు, ప్రజా కవులు ప్రజలకు చేసిన దారుణాలు అందరికీ తెలిసినవే.
తెలుగు నేలపై నక్సలైట్స్ చేసిన దారుణాలు, హింస, దోపిడి తమిళ్ష్‌నాడులో జరగక పోవడానికి కారణం ఎమ్.జీ. రామచంద్రన్. ఇవాళ దేశ హోమ్ మంత్రి అమిత్ షా నక్సలైట్స్ రహిత దేశం కోసం కృత నిశ్చయంతో ఉద్యుక్తులయ్యారు. అమిత్ షా ఆధ్వర్యవంలో, కార్యాచరణలో మనదేశం పూర్తిగా నక్సలైట్స్ రహిత దేశం అవుతుందని ఆశిద్దాం.

9444012279