– ఎంపి వద్దిరాజు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాక 10ఏండ్లు సుపరిపాలన అందించి అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గొప్ప పాలనాదక్షులు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తీవ్ర బాధాకరమని ప్రజలు అంటున్నరు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే గొప్ప ఎత్తిపోతల పథకం. ఇది ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, మొత్తం 3బ్యారేజీలు,15 రిజర్వాయర్లు,9 సబ్ స్టేషన్లు,21పంప్ హౌస్ లు,203కిలోమీటర్ల టన్నెలింగ్ కెనాల్స్,1531కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్,530మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసే సిస్టమ్,240టీఏంసీల నీళ్ల వినియోగం.
మేడిగడ్డ మొత్తం 85పియర్స్ లో కేవలం మూడంటే మూడు కుంగిపోయినంత మాత్రాన ప్రాజెక్టు పూర్తిగా విఫలమైనట్టు కాదు. రాజకీయ దురుద్దేశంతో,కక్ష సాధింపు ధోరణితోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. తెలంగాణలోని బీడు భూములకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేయాలనే దృఢ సంకల్పంతోనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు.
చార్మినార్ వద్ద చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి దేశం దృష్టిని మళ్లించేందుకే , కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు.ఇది కాంగ్రెస్ “డైవర్షన్ పాలిటిక్స్”లో భాగమే తప్ప మరొకటి కాదు