Suryaa.co.in

Telangana

ఫార్మసిస్ట్స్ సమస్యలు పరిష్కరిస్తా

– మంత్రి దామోదర రాజనర్శింహ

హైదరాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని తెలంగాణ ప్రభుత్వ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్ లో ని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రం లో అన్ని బస్తీ , పల్లె దవాఖాన లలో ఫార్మసిస్ట్స్ లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాలో DMHO పరిధిలోని ఫార్మసీ స్టోర్స్ , వ్యాక్సిన్ స్టోర్స్ లలో, మలేరియా, లెప్రసీ, టీబీ సెంటర్లలో ఫార్మసిస్టులను నియమించాలని కోరారు.

అన్ని PHC లలో ముగ్గురు ఫార్మసి ఆఫీసర్లను నియమించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ కి తెలంగాణ ప్రభుత్వ ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టీచింగ్ ఆసుపత్రులలో క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ కి వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో ఫార్మసీ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు.

మంత్రిని కలిసిన వారిలో ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శరత్, అహమదుల్లా, కె. లావణ్య , తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE