– మోడీ చర్యలను సమర్ధించండి
– అలాంటివారికి ఎలాంటి శిక్ష విధించినా ఏమీ కాదు
– బలూచిస్థాన్ ప్రధానమంత్రి నైలా ఖాద్రీ
తల్లి పాలు తాగినప్పుడు.. కచ్చితంగా ఆమె మీద గౌరవం ఉండాలి. ఆ సంస్కారాన్ని ప్రదర్శించాలి. అంతేతప్ప పాలు తాగినంతసేపు మాత్రమే మమకారాన్ని చూపి.. ఆ తర్వాత అడ్డగోలుగా ప్రవర్తించకూడదు. భారత్ అంటే గొప్ప దేశం. ఇంతవరకు ప్రపంచంలో భారత్ మరొక దేశంపై దండయాత్ర చేయలేదు. యుద్ధం చేయలేదు.. తన ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర దేశాలను వాడుకోలేదు. కేవలం రాజ్యాంగబద్ధంగా మాత్రమే వ్యవహరించింది.
సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించింది. ఏ మాత్రం అడ్డగోలుగా పనులు చేయలేదు. కానీ ఇప్పుడు ఉగ్రవాద దేశంపై భారత్ దాడి చేస్తుంటే.. భారత్లో ఉన్నవారు విమర్శలు చేయడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతటి ఉగ్రవాద దేశంలో కూడా భారత్ అంటే పడి చచ్చేవారు చాలా మంది ఉన్నారు. భారత్ లో ఉన్న స్వేచ్ఛను చూసి హర్షం వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు.
తమను భారతదేశంలో భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ ఇండియాలో ఉన్న వారికి అది అర్థం కావడం లేదు. ఇండియా గొప్పతనం వారికి అవగతం కావడం లేదు. ఇలాంటి దిక్కుమాలిన మనస్తత్వం ఉన్న వ్యక్తులు కేవలం భారతదేశంలో మాత్రమే ఉంటారేమో. అలాంటివారికి ఎలాంటి శిక్ష విధించినా ఏమీ కాదు.
ఎందుకంటే దేశం ముందు ఏదీ ఎక్కువ కాదు.. వ్యవస్థలను ధిక్కరించి ప్రవర్తించే వారికి కచ్చితంగా ఏదో ఒక శిక్ష పడాలి. అలాంటి శిక్ష పడితేనే వారు తమ నోరు అదుపులో పెట్టుకుంటారని” బలూచిస్థాన్ ప్రధానమంత్రి నైలా ఖాద్రీ వ్యాఖ్యానించారు.