మీకు పట్టా పొలం ఉండి..ఆ పొలం పక్కనే సీలింగ్ ల్యాండ్ ఉండి ఉంటే మీ పొలం సర్వే నెంబర్,సీలింగ్ ల్యాండ్ సర్వే నెంబర్లో నుండి సబ్ డివిజన్ అయితే మీరు కచ్చితంగా ఒక్కసారి రికార్డ్ లు చెక్ చేసుకోవాల్సిందే.(లేకపోయినా చెక్ చేసుకోండి)
అర్ధం కాలేదా?
ఉదాహరణకు సర్వే నెంబర్ 2-3లో 8 ఎకరాల 30 సెంట్లు ఉంది అనుకున్నాం.
అందులో ప్రభుత్వం 5 ఎకరాల 30 సెంట్లను అసైన్మెంట్ ల్యాండ్ కింద తీసుకొని పేదలకు పంచింది..మిగిలింది ఇంకా 3 ఎకరాలు.ఈ మూడు ఎకరాలకు పట్టా ఇచ్చి సబ్ డివిజన్ చేస్తుంది.
అయితే ఆ పేదలకు పంచిన 5.30సెం కు 2-3A అనే సర్వే నెంబర్ ఇస్తుంది.
మిగిలిన 3 ఎకరాలకు 2-3B అని ఇస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఇక్కడే అసలైన మతలబు జరుగుతుంది.
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సీలింగ్ ల్యాండ్ రికార్డ్ (22a అంటారు).స్థానిక MRO ఆఫీస్ వారు కలెక్టర్ గారి ఆఫీస్ పంపిస్తారు.ఈ రికార్డ్ పంపేప్పుడు VRO అశ్రద్ద కావోచ్చు,పొరపాటు కావోచ్చు,లేదు మీరు ఏదైనా VROకి ఇష్టంలేని, రాజకీయ పార్టీకి కార్యకర్త,నాయకుడు కావోచ్చు.
సదరు VRO ఆ రికార్డ్ ఆప్లోడ్ లో నిర్లక్ష్యం వల్ల, మీ పొలం రికార్డ్ 22aలో చూపిస్తుంది.
మీరు అనుకోవచ్చు.నా పాస్ బుక్ నా దగ్గరే ఉంది అని, లేదు గబగబా వెళ్ళి మీసేవాలో ROR,అండంగల్ తీయించి అమ్మయ్యా అని తృప్తి పడవచ్చు..ఇక్కడ మీరు ధాల్ లో కాలేశారు..
అవన్ని వస్తాయి.కాని అసలైనది తెలియాలంటే సదరు రెవిన్యూ గ్రామ ఇలాక(తాలుకా) సబ్ రిజిస్టార్ ఆఫీసులో, మీ పొలం తాలుకా వాల్యేషన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయండి.అక్కడ తెలుస్తుంది.మీది ఏ రికార్డ్ లో ఉందో..సరే 22a రికార్డ్ లో లేదు అనుకోండి. సంతోషం.వాల్యుయేషన్ వస్తుంది.
ఒకవేళ ఉంటే ఏమి చేయాలి?
మీ పొలం తాలుకా రెవిన్యూ MRO ను కలవండి.
మీ డాక్యూమెంట్లు,పాస్ బుక్,అడంగల్,ROR,EC కాపీ.(ఇది మీసేవాలో అప్లై చేయాలి.రెండు రోజులకు వస్తుంది.1983 సం. నుండి తీసుకోండి )ఆధార్ కార్డ్ (జిరాక్స్) రెండు సెట్లు తీసుకొని ఒకటి స్పందన కార్యక్రమంలో కలెక్టర్,సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయండి.
రెండవ సెట్ కి .. 22a మాడ్యూషన్ అప్లికేషన్ తీసుకొని, అందులో వివరాలు పొందుపరచి, మీ సేవాలో అప్లై చేసి ఆ అప్లికేషన్ స్థానిక VRO,MROకి ఇవ్వండి.
ప్రభుత్వం ఈ పని పూర్తి కావడానికి 120 రోజులు కాలపరిమితి పెట్టింది.మీ రికార్డ్ సరైనవి అయితే, కచ్చితంగా ఆ పని ఆ కాలపరిమితి లోపే పూర్తి అవుతుంది.
– రమేష్ నెలకూడి