– డీజీపీకి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ
• పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర పట్ల వైసిపి గూండాలు దౌర్జన్యంగా వ్యవహరించిన అంశంపై లేఖ
• లేఖలో చంద్రబాబు:-
• పెంకులపాడులో నిన్న టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ లను వైసిపి శ్రేణులు అడ్డుకున్నారు.
• ఇద్దరు నేతలు వేదికపైకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా వైసిపి గూండాలు వారిపై దాడి చేశారు.
• ఈ దాడిలో కిందపడిన ఎమ్మెల్యే రామానాయుడు గాయపడ్డారు.
• YSRCP అనుచరుల దౌర్జన్యకాండపై అక్కడే ఉన్న డిఎస్పి సహా పోలీసులు ఎవరూ స్పందించలేదు.
• ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం విస్మయం కలిగించింది.
• టిడిపి ప్రజా ప్రతినిధులకు సంబంధించి తీవ్రమైన ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయి.
• పోలీసుల సమక్షంలోనే ఇద్దరు ప్రజా ప్రతినిధులకు రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?
• ఘటనపై సమగ్ర విచారణ జరిపి అలసత్వం ప్రదర్శించిన పోలీసులతో పాటు దాడికి పాల్పడిన వైఎస్‌ఆర్‌సిపి గూండాలపై చర్యలు తీసుకోవాలి.
• పోలీసులు సమర్థవంతంగా, నిజాయితీగా వ్యవహరించడం ద్వారా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
• లేఖతో పాటు నేతలపై దాడికి సంబంధించి వీడియోలు, ఫోటోలు జత చేసిన టిడిపి అధినేత.