– కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తిరిగి అది కేసిఆర్ కు వేసినట్టే
– సీఎం కేసిఆర్, ఏం మొహం పెట్టుకొని గ్రామాల్లోకి వస్తాడు?
– 8 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు
– ఎమ్మెల్యే ఈటల రాజేందర్
తెలంగాణలో బిజెపి గెలిచి తీరాలని ప్రధాని మోడీ సీరియస్ గా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్, బిఅర్ఎస్ పార్టీల నాయకులు పార్లమెంట్ లో చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తిరిగి అది కేసిఆర్ కు వేసినట్టే. తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేస్తే చిల్లర ఆరోపణ చేసి తనను బి ఆర్ ఎస్ పార్టీ నుండి బయిటికి పంపారు. రాత్రి పగలు కష్టపడి తెలంగాణలో పార్టీని గెలిపించాలని వరంగల్ సభలో ప్రధాని మోడీ, జెపి నడ్డ చెప్పారు. సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే కర్తవ్యం. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా పంచని సీఎం కేసిఆర్, ఏం మొహం పెట్టుకొని గ్రామాల్లోకి వస్తాడు? బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఇంట్లో ఇద్దరు వృద్దులు ఉంటే వారిద్దరికీ పెన్షన్ లు ఇస్తాం.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద 8 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఈ సారి సీఎం కేసిఆర్ కు ఓటు వేస్తే మన బతుకులు అగమే.