– రాష్ర్టాల్లో అమలయ్యే పథకాలన్నీ కేంద్ర నిధులతోనే
– కొన్ని పథకాలకు సొంత నిధులు కూడా ఇవ్వలేని రాష్ర్టాలు
– తండ్రి, తాతల పేర్లతో పథకాల ప్రచారం
– ప్రధాని ఫొటో కూడా వేయని రాష్ర్టాలు
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో తండ్రులు, తాతలు, అమ్మల పేరుతో కనిపించే సంక్షేమ పథకాలకు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలేవీ డబ్బులు ఇవ్వడం లేదు. అవన్నీ పూర్తిగా కేంద్రం ఇచ్చిన నిధులతో కొనసాగుతున్న పథకాలే. కానీ దానికి ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు.. వారి తండ్రులు, తాతలు, అమ్మల ఫొటోలు, వారి పేర్లతో పథకాలు కొనసాగిస్తున్న సంప్రదాయం కొనసాగుతోంది.ఆ పథకాలు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులే నిధులు ఇస్తున్నట్లు పేరు గొప్ప ప్రచారం. వందలకోట్లతో ప్రచారం.
నిజానికి రాష్ర్టాల్లో అమలవుతున్న కొన్ని డజన్ల పథకాలకు అయ్యే ఖర్చంతా కేంద్రానిదే. కానీ వాటిపై ఎక్కడా ప్రధానమంత్రి ఫొటో, భూతద్దం వేసి కనిపించదు. అంటే సొమ్ము కేంద్రానిది. సోకు రాష్ర్టాలదన్నమాట. అటు ప్రజలకు సైతం ఈ పథకాల వివరాలు, వాటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న వాస్తవాలు తెలియకపోవడమే వింత. వాటికి కేంద్రమే సొమ్ములు ఇస్తుందని, ఆయా పథకాలకు రాష్ట్ర మ్రపభుత్వాలు నిధులివ్వదన్న విషయం చాలామందికి తెలియకపోవడమే ఆశ్చర్యం. కేంద్ర నిధులతో కొనసాగుతున్న పథకాలేమిటో ఓసారి చూద్దాం.
దేశంలోని ప్రతి గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నడుస్తున్న పథకాలు(పనులు)
(1) ఉచిత రేషన్ బియ్యం
(2) గ్రామీణ ఉపాధి హామీ నిధులు
(3) స్వచ్ఛభారత్ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం
(4) వీధి దీపాలు
(5)స్మశాన వాటికల నిర్మాణం
(6) డంప్ యార్డ్ ల నిర్మాణం
(7) పల్లె ప్రకృతి వనాలు
(8)సిసి రోడ్ల నిర్మాణం
(9) సైడు కాలువలు
(10) సెగ్రిగేషన్ షెడ్
(11)ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
(12)ప్రధానమంత్రి ఉజ్వల యోజన
(13) ప్రధానమంత్రి మాతృ వందన యోజన
(14) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (సంవత్సరానికి ₹20 లకు రెండు లక్షల ప్రమాద భీమా)(15)ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (సంవత్సరానికి 436 రూపాయలకు 2 లక్షల బీమా)
(16) ఆడపిల్లల భవిష్యత్తు కొరకు సుకన్య సమృద్ధి యోజన
(16) పీఎం కిసాన్ (సన్న కారు రైతుల కొరకు)
(17) పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన
(18) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన
(19) ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన(20) రాష్ట్ర రాష్ట్రీయ గ్రామీణ అజీవక మిషన్
(21) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
(22) ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన
(23) ప్రధానమంత్రి ఆవాస్ యోజన
(24) ప్రధానమంత్రి ముద్ర యోజన
(25) అటల్ పెన్షన్ యోజన