Suryaa.co.in

Telangana

దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలు పెట్టండి

– పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల పై వెంటనే అనర్హత వేటు వేయాలి. మీ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారే పార్టీ మారిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,శాసన సభాపతి ప్రసాద్ ,ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న.

ఛాలెంజ్ చేస్తున్న.. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేసి ఎన్నికలు పెట్టండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం.. ప్రజలే న్యాయనిర్ణేతలు. మీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక చర్యలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోలీసులతో మీరు చేస్తున్న అరాచక పాలన, అరెస్టులు, ప్రశ్నించిన వారిపై మీరు పెడుతున్న కేసులు అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మీకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

LEAVE A RESPONSE