Suryaa.co.in

Telangana

దమ్ము ధైర్యం ఉంటే గజ్వేల్ లో నా మీద గెలువు…రా..తేల్చుకుందాం!

-చెన్నూరు ఎమ్మెల్యే బెయిలుకు లేట్ అయితే కేసీఆర్ ను అనేక తిట్లు తిట్టిన వ్యక్తి.
-ఎమ్మెల్యేలను కొనడం నీ నీతి ఏందీ ? జాతీ ఏందీ?
-ఏపీ, కర్నాటక, బీహార్ తమిళనాడు ఎన్నికలకు డబ్బులు పంపించలేదా?
-నీకు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు కు వెళ్ళు చూసుకుందాం
-కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్
-కేసీఆర్‌పై విరుచుకుపడ్డ బీజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఆయనను రియల్‌ఎస్టేట్ బ్రోకర్‌గా అభివర్ణించారు. ఇతర రాష్ట్రాల ఎన్నికలకు డబ్బులు పంపేంత స్థాయికి ఒక ప్రాంతీయ పార్టీ ఎలా ఎదిగిందని నిలదీశారు. తనపై బానిసలతో విమర్శలు ఆపకపోతే తానేమిటో చూపిస్తానని హెచ్చరించారు. ఇంకా ఈటల ఏమన్నారంటే…

కేసీఆర్‌ నేను ఇచ్చిన సవాలుకు సమాధానం చెప్పే దమ్ము లేక, బానిసలతో ప్రెస్ మీట్ పెట్టి నాపై తిట్ల పురాణం కురిపిస్తున్నారు. కేసీఆర్ తో సమస్యల మీద, ఎక్కడ అయిన చర్చకు సిద్దమని గతంలో అనేక మార్లు చెప్పాను. ఈరోజు మాట్లాడిన బానిసలు వాళ్ల చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. చెన్నూరు ఎమ్మెల్యే, మాలాంటి వాళ్లను బాధ పడేటట్టు మాట్లాడటం తప్ప, జాతి కోసం చేసింది ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో జైల్ లో ఉన్నప్పుడు, బెయిలుకు లేట్ అయితే కేసీఆర్ ను అనేక తిట్లు తిట్టిన వ్యక్తి. ఊసరవెల్లిలా రంగులు మార్చిన వారు నా మీద మాట్లాడుతున్నారు.

2002 లో ఉద్యమంలో భాగంగా మా జిల్లా అధ్యక్ష కోరిక మేరకు గజ్వేల్ లో పార్టీలో జాయిన్ అయ్యాను. ఎమ్మెల్యే అవుతానని జాయిన్ అవ్వలేదు. పల్లెబాట ముగింపు సభ లో కమలపుర్ లో భారీగా నిర్వహించినందుకు అది మెచ్చుకున్న కేసీఆర్ .. నాకు ఆ సభ ముఖంగా టికెట్ హామీ ఇచ్చారు.

2004 లో 26 మంది టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 10 మంది పార్టీ మారిన కూడా నేను పార్టీ మారలేదు. 2008 ఉప ఎన్నికల్లో భారీ 2004 కంటే భారీ మెజారిటీ తో గెలిచాను. 2009 లో 54 సీట్లకు పోటీ చేస్తే, పట్టుమని పది మంది గెలవలేదు అని అసెంబ్లీ సాక్షిగా ఆనాటి సీఎం వైఎస్ఆర్ నన్ను హేళన చేశారు.

ఆత్మగౌరవం ఉన్నవారు కేసీఆర్ దృష్టిలో లీడర్లు కారు. 2018 లో ఎన్నికల్లో అధికార పార్టీలో ఉండి పోటీ చేసినప్పుడు, ఎన్నికల అధికారులు నా ఇంటి మీద దాడి చేయించారు. ప్రగతి భవన్ లో డబ్బులు ఇచ్చి, కరపత్రాలు కొట్టించి నా మీద ed వంటి అన్నీ సంస్థలో 2018 ఎన్నికలకు ముందు కంప్లైంట్ ఇచ్చారు.నన్నే కాకుండా ఇంకో ముగ్గురి మీద ఖమ్మం , నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి పటిష్టమైన నాలాంటి నేతల మీద ఇలానే కంప్లైంట్ చేపించి ఓడించారు.

సూటిగా అడుగుతున్నా.. కేసీఆర్ ను నేను ఎం తప్పు చేశానని మంత్రి పదవి నుంచి నన్ను సస్పెండ్ చేశారు? ఆర్థిక శాఖ మంత్రి, అరోగ్య శాఖ మంత్రి గా సరిగా బాధ్యతలు నిర్వర్తించలేదా?కుట్ర పూరితంగా నేర పూరితంగా వ్యవహరించి నన్ను బయటికి వెళ్లేలా చేశారు. బయటికి పంపించి నా , ఒక్క మాటా కూడా నేను మాట్లాడకపోయినా కరీంనగర్ ఎమ్మెల్యే ల చేత ప్రెస్ మీట్ పెట్టి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పారు.

ఆత్మగౌరవంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలిచాను. ఈటెల గెలిస్తే రాజకీయా సన్యాసం తీసుకుంటానని మాట్లాడిన ఎమ్మెల్యే ఏమైంది? అనాడు దమ్ము దైర్యం ఉంటే కేసీఆర్, హరీష్ ఎవరూ వస్తారో రమ్మన్నా… హుజూరాబాద్ లో నా మీద కొట్లాడింది కేసీఆర్ – హరీష్ రావు తప్ప, ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి కాదు. నన్ను ఓడగొట్టెందుకు దళిత బంధు స్కీమ్స్ తెచ్చావు. కోకాపేట్ లో అమ్మిన భూమి డబ్బులను నేరుగా హుజూరాబాద్ దళిత బంధు కోసం కలెక్టర్ అకౌంట్ లో కి వేశావ్. ఎన్నికలలో ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసి దేవుడి మీద ఒట్టు వేసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాలలో దావతులు పెట్టి, వాళ్ళే వడ్డించి నీచమైన రాజకీయ సంస్కృతికి తెరలేపిన వ్యక్తి కేసీఆర్..

రెండు రోజులు వరుస పెట్టి ప్రెస్ మీట్ లు పెట్టిన, ప్రజలు ఎన్నికల ముందు హుజూరాబాద్ ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెట్టారు. ఎమ్మెల్యే ల పని తీరు బాలేదు అని సర్వే చేపిస్తున్న కేసీఆర్ .. అది కాదు మీ స్కీమ్స్ ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ ను ఓడగొడితే తప్ప ప్రజలు విముక్తి పొందుతారు. హుజూరాబాద్ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకొని నన్ను గెలిపించారు.

అన్నీ ఫ్లెక్సీ, కరెంట్ స్థంబాల మీద మీ బొమ్మ ఉంటే, ప్రజలా గుండెల్లో నా బొమ్మ ఉంది కాబట్టే నన్ను గెలిపించారు. దమ్ము ధైర్యం ఉంటే గజ్వేల్ లో నా మీద గెలువు… రా తేల్చుకుందాం అంటున్న. హైదరాబాద్ లో ఉన్న అనేక మంది దళిత బిడ్డల అసైన్డ్ భూములను గుంజుకుంటున్నరు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా కేసీఆర్ మారారు వర్షం కాలంలో గిరిజన ప్రజలు ఎక్కడ అధికారులూ ఇబ్బంది పెడతారని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. మీరు దళిత జాతి కోసం హైదరాబాదులో దళితుల భూములు తిరిగి ఇప్పించండి.

వీఆర్ఏ ఈరోజు సమ్మే చేపడుతున్నారు. దమ్ముంటే మీ ముఖ్యమంత్రి తో వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. ఎంత సేపు ప్రగతి భవన్ కు గులాం గిరి చేయడమేనా? ఇంకా ఏడాదీ 3 నెలలు ఎన్నికలకు సమయం ఉంది . నీకు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఏ క్షణం ఆయిన ముందస్తు కు వెళ్ళు చూసుకుందాం… ఇదే మాట పరేడ్ గ్రౌండ్ సభలో అమిత్ షా కూడా ఛాలెంజ్ చేశారు.

ఉద్యోగులకు ఒకటో తారీకు జీతం ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెడతారు. నాలాంటి వాళ్ల మీద, నీ బానిసల చేత విమర్శలు చేస్తే .. సూర్యుని మీద ఉమ్ము వేసినట్టు ఉంటాది తప్పా ఏమి ఉండదు. 2014 లో టీడీపీ ఎమ్మెల్యే లు కోని పార్టీ లేకుండా చేసి వాళ్ళని మంత్రులు చేశారు. 2018లో 90 సీట్లు గెలిచాక కాంగ్రెస్ ఎమ్మెల్యే ల అవసరం ఉందా?

తెలంగాణ ఇచ్చిన పార్టీ ఎమ్మెల్యే లను కొనడం నీ నీతి ఏందీ ? జాతి ఏందీ? హైటెక్ సిటీ ప్రాంతంలో పాత లేఔట్లు ఉన్న వాళ్లను బెదిరించి కొంటున్నారు. అన్యాయంగా సంపాదించిన డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అని కేసీఆర్ అనుకుంటున్నారు. ఏపీ, కర్నాటక, బీహార్ తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలకు డబ్బులు పంపించింది వాస్తవం కాదా? అతి తక్కువ కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని డబ్బులు ఎలా సంపాదించింది? హుజూరాబాద్ లో మొన్నే కదా కేసీఆర్ ఓడిపోయింది. ఎన్ని సార్లు ఓడిపోతావ్? మొన్న హుజూరాబాద్ లో ఓడింది అభ్యర్థి కాదు కేసీఆర్ ఓడిపోయాడు. మా అమ్మ నాకు సంస్కారం నేర్పింది కాబట్టి నేను వ్యక్తిగతంగా మాట్లాడను. 4 కోట్ల తెలంగాణ ప్రజల విముక్తి కోసం రాజకీయాల్లోకి వచ్చాను.
కేసీఆర్ సర్వశక్తిలొడ్డి హుజూరాబాద్ ఎన్నికల్లో పాల్గొన్నారు.. కాబట్టి అక్కడ ఆయన్నే ఓడించాను. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాకు ఎవరు శత్రువులు లేరు. నేను అందరి ప్రేమను కలిగిన వ్యక్తి నీ. నన్ను పట్టుకొని ఇంత ఇబ్బందులకు గురి చేస్తారా? రాజకీయాల్లో స్పోర్ట్స్ మన్ స్పిరిట్ ఉండాలి. అది కేసీఆర్ కు లేదు. టీఆర్ఎస్ లేదు brs లేదు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు. నన్ను ప్రపంచ నేరస్తుడిల చూస్తున్నావ్.. నీవు బ్రోకర్ అని నేనెప్పుడూ ఆయిన అన్నానా?

LEAVE A RESPONSE