Suryaa.co.in

Telangana

ఈ డిక్లరేషన్.. ఆ డిక్లరేషన్ కాదు.. దమ్ముంటే సీఎం డిక్లరేషన్ చెయ్ రాహుల్ గాంధీ!

– టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే తెలంగాణలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఖమ్మం సభకు వస్తున్న రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) చైర్మన్ వై.సతీష్ రెడ్డి. ఖమ్మం సభలో ఈ డిక్లరేషన్.. ఆ డిక్లరేషన్ కాదు.. సీఎం డిక్లరేషన్ చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌరవ కేసీఆర్ మళ్లీ సీఎం అభ్యర్థి అని ఇప్పటికే గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీఎం క్యాండిడేట్ అనేది రాహుల్ సభలో ప్రకటించి వెళ్లాలన్నారు. ప్రజలు 5 రూపాయల పేస్ట్ కూడా బ్రాండ్ చూసి కొంటారని.. అలాంటిది నాయకుడు ఎవరో తెలియని పార్టీకి ఓటేసి అధికారం కట్టబెడతారని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. కబ్జాకోరులు, దళారులు, బ్లాక్ మెయిలర్లకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వబోరన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు ఇప్పటికీ మానని గాయంలా ప్రజలను బాధ పెడుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో భూమి అడిగిన పేదలపై ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కషంగా గుళ్ల వర్షం కురిపించి వారిని పొట్టనపెట్టుకున్న ఘటన ఇప్పటికీ కళ్లముందే తిరుగుతోందన్నారు. కాంగ్రెస్ పాలన ఎంత దుర్మార్గంగా ఉంటుందనే దానికి ఆనాడు కాల్పుల్లో గాయపడిన వారే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు.

ఆనాడు కాల్చి చంపిన నేలపైనే సభ పెడుతున్న రాహుల్ గాంధీ ఆ అమరుల కుటుంబాలకు, అడవి బిడ్డలకు క్షమాపణలు చెప్పాకే తెలంగాణలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పొరుగునే ఉన్న చత్తీస్ గఢ్, అటు రాజస్థాన్ లో కాంగ్రెస్ పాలన ఎంత దారుణంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ 60 ఏళ్లలో గిరిపుత్రులను పట్టించుకోలేదని, పోడు భూముల గురించి ఆలోచన చేయలేదని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలిచ్చి వారికి రైతుబంధు, రైతుబీమా, నీటి వసతి కోసం బోర్లు, వాటికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి గిరిపుత్రులను సిరిపుత్రులుగా చేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.

LEAVE A RESPONSE