– పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్
మునుగోడు: విద్యార్ధులు ఇష్టపడి చదివితే..ఫలితం అద్భుతంగా ఉంటుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ, వ్యక్తిత్వ వికాస నిపుణులు మాచన రఘునందన్ స్పష్టం చేశారు.శనివారం నాడు ఆయన మునుగోడు జడ్పి హై స్కూల్ లో..మిడ్ డే మీల్స్ బియ్యం నాణ్యత తనిఖీ చేశారు.తదనంతరం పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ కలిగించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి స్వతహాగా విషయ ఆసక్తి కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.