విజయ మెవ రిదో .. ఓటమెవరిదో ….జూన్ 4 న తెలుస్తాది !
కానీ, ఓటింగ్ జరిగిన తీరు అద్భుతం !
ఉత్కంఠ రేపుతున్న తీరు మహాద్భుతం !!
ఏది ఏమైనా ….
ఒక్క ఎకరా కూడా సాగు లోకి తేని వ్యక్తికి ….
అతి ముఖ్యమైన ఒక్క పోలవరం ప్రాజెక్ట్ నైనా పూర్తి చేయించనీ వ్యక్తికి…
ఒక్క రాజధాని నైనా నిర్మించని వ్యక్తికి ..
అమరావతి రైతులనేక మంది ఆత్మ హత్యలకు ,అకాల మరణాలకు కారకుడైన వ్యక్తికి ….
ఒక్క కంపె నీ నైనా తెచ్చి పది మందికి ఉపాధి చూపించని వ్యక్తికి..
వందల కోట్లు పన్నులు కడుతూ,వేలాది మంది కి ఉపాధి చూపించే అమర రాజ బాటరీస్ లాంటి వాటిని కుల కక్ష తో తరిమి వేసిన అనాగరికునికి..
కుల కక్ష తో ఐ ఎ ఎస్, ఐ పీ ఎస్ ఆఫీసర్ల ను వేధించిన వ్యక్తికి …..,
ఒక్క సారైనా మెడ ఎత్తి మోడీ నీ ప్రత్యేక హోదా గురించి అడగని వ్యక్తికి ….,
ఒక్క చెట్టు నైనా నాటకుండా వేలాది చెట్లను నరికి వేయించిన వ్యక్తికి ….,
ఒక్క సారైనా కోర్టు ముందు హాజరు కాకుండా ,పెత్తనం చెలాయిస్తూ దేశ దేశాలు తిరుగు తున్న వ్యక్తికి …
సొంత కుటుంబంలోని వ్యక్తిని హత మార్చి న వారికి అండగా నిలిచిన వ్యక్తికి…,
ఒక దళిత డాక్టర్ మరణానికి కారకుడైన వ్యక్తికి ..
దళితుల్ని గుండు కొట్టించి , శవాలను డోర్ డెలివరీ చేసిన వారికి అండగా నిలిచిన వ్యక్తికి…
కోడెల ,అచ్చన్న , ఆర్ ఆర్ ఆర్ లాంటి వారినీ ప్రాణాంతక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి …
వీర జవాన్ల మరణంలోకూడా .. కులం చూసి ప్రభుత్వ సహాయం చేసిన వ్యక్తికి ….,
ఒక్క మంచి బ్రాండ్ మందు నైనా లేకుండా చేసి,తప్పుడు లిక్కర్లు అత్యధిక రేట్లకు అమ్మించిన వ్యక్తికి ….
సొంత మీడియాకు వందలాది కోట్ల ప్రకటనలు జారీ చేసిన వ్యక్తికి ….
అసలు కుర్చీని వ్యాపారంగా మలచు కున్న వ్యక్తికి ….
40 శాతం కు పైగా ఓటర్లు బారులు తీరి నిలబడి ఓట్లు వేశారంటే ..
ఔరా. …కాల మహిమ!
అసలు ఏ వర్గాల వారు నిజమైన భాధితులో ,వారే తండోప తండాలుగా ఓట్లు గుమ్మరించారంటే ……
అజ్ఞానమా …?!
అమాయకత్వమా ….?!
డబ్బు ఆశా …?!
ఆయా వర్గాల నాయకుల ,
మేధావుల కుటిల స్వార్ధాలా..?!!
దట్టంగా వంట బట్టిన మత ,కుల గజ్జిలా ….? !
నిలువెల్లా నింపు కున్న కుల ద్వేషాలా ?!
ఇన్ని దుష్ట శక్తులు న్న సమూహాల్లో
అభివృద్ధి జరగాలంటే ఆంధ్ర లో జరిగే పనేనా ?!
ఇక మనం …
మరల బ్రిటిష్ వాడే సమర్థుడని సర్ ఆర్థర్ కాటన్ పుట్టిన రోజు న భావించు కోవటం తప్పు అవుతుందా ?!
– జి. వి.రామ్ ప్రసాద్,
విజయవాడ